పిల్లలను కనడం పై పవిత్ర నరేష్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

సినీ ఇండస్ట్రీలోకి విజయనిర్మల( Vijaya Nirmala ) వారసుడిగా అడుగుపెట్టారు నటుడు నరేష్.( Naresh ) ఈయన కెరియర్ మొదట్లో హీరోగా నటించారు.

 Naresh And Pavitra Lokesh Sensational Comments On Kids Details, Pavitra Lokesh,-TeluguStop.com

అనంతరం కమెడియన్ హీరోగా అలాగే ప్రస్తుతం తండ్రి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈయన కెరియర్ పరంగా సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం సంతోషంగా లేరని చెప్పాలి.

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మనస్పర్ధలు కారణంగా తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Telugu Krishna, Naresh, Pavitra Lokesh, Pavitralokesh, Ramya Raghupati, Vijaya N

ఇలా ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన ఈయన తిరిగి సినీనటి పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) తో ప్రేమలో పడటమే కాకుండా ఆమెతో రిలేషన్ లో ఉంటూ చివరికి తనని పెళ్లి కూడా చేసుకున్నారు.ఇక వీధిద్దరి వ్యవహారం పై నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి( Ramya Raghupati ) గతంలో సంచలనమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ వివాదం ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.

అయితే తాజాగా వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వారి రిలేషన్ గురించి అలాగే పిల్లల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

Telugu Krishna, Naresh, Pavitra Lokesh, Pavitralokesh, Ramya Raghupati, Vijaya N

ఈ వయసులో మీరు పిల్లల్ని కావాలని అనుకుంటున్నారా అనే ప్రశ్న వీరికి ఎదురయింది.ఈ ప్రశ్నకు పవిత్ర సమాధానం చెబుతూ.ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల లేని ఎంతోమంది అనాధ పిల్లలు ఉన్నారు అయితే మేము కలిసిన ఉద్దేశం అది కాదని తెలిపారు.

ఇక నరేష్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ నాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు పవిత్రకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.మేము ఈ ఐదుగురిని మా పిల్లలలాగే భావిస్తున్నాము.

పిల్లల్ని కనడానికి మేము ఇప్పటికీ మానసికంగా అలాగే శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నాము.కానీ ఇప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే వారికి 20 సంవత్సరాలు వచ్చే సమయానికి మాకు 80 సంవత్సరాలు వయసు వస్తుంది .అందుకే ఇప్పుడు మాకు అవసరం లేదని, మేము కూడా అమ్మ విజయనిర్మల కృష్ణ( Krishna ) గారి లాగే ఉండాలని అనుకుంటున్నాము అంటూ నరేష్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube