పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ అనంతరం వర్షం చత్రపతి వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అలాగే డార్లింగ్ , మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ప్రేమకథా చిత్రాల ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక బాహుబలి( Bahubali ) సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.
ఈయన నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నాయి.
ఈ విధంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ కి చాలా వీక్నెస్ లు ఉన్నాయి అంటూ దర్శకుడు రాజమౌళి( Rajamouli ) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే.ఇక చత్రపతి సినిమా షూటింగ్ సమయంలో అందరూ తనని చూస్తుండగా డైలాగ్ చెప్పలేకపోవడంతో తనలో తానే డైలాగులు చెప్పుకోగా రాజమౌళి వాటిని కవర్ చేసినట్లు కూడా తెలిపారు.
ఈ క్రమంలోనే మిస్టర్ ఫర్ఫెక్ట్( Mr.Perfect ) సినిమా సమయంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిపారు.అయితే ఈ సినిమాలో సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్( K Vishwanath ) గారు నటించిన సంగతి తెలిసిందే.ఆయనతో వచ్చే సన్నివేశాల సమయంలో ప్రభాస్ కాస్త మొహమాటపడుతూ డైలాగులు చిన్నగా చెప్పి ఎలాగో అలాగా ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట అయితే ఈ సన్నివేశం పూర్తయిన వెంటనే విశ్వనాథ్ గారు ప్రభాస్ ని పిలిపించుకొని మరి క్లాస్ పీకారని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ తెలిపారు.
ఇన్ని సినిమాలు చేశావు స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నావు.ఇలా అందరిలో ఇలా మొహమాట పడటం ఏంటి? అయినా నిన్ను కాదు నిన్ను ఇలా తయారు చేసిన రాజమౌళిని అనాలి అంటూ ఆయన తిట్టారని ప్రభాస్ వెల్లడించారు.