సాధారణంగా సినిమాల్లో హీరోలకు సూపర్ పవర్స్ ఉన్నట్లు దర్శకులు చూపిస్తుంటారు.హీరోలను చాలా బలవంతులుగా చిత్రీకరిస్తారు.
వారికి ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉన్నట్లు కథ రాసుకుంటారు.ఇక హీరోయిన్లను అందంగా మాత్రమే చూపిస్తారు.
వారికి పెద్దగా గొప్ప నైపుణ్యాలు ఉన్నట్లు చూపించరు.దీని ఫలితంగా హీరోయిన్లకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు.
మేకప్ వేసుకొని నవ్వుతూ మాట్లాడితే సరిపోతుంది.ఇలాంటి ట్రెండ్‌ను చాలామంది ఫాలో అవుతూ వచ్చారు.
ఇప్పుడిప్పుడే హీరోయిన్లకు కూడా వెయిట్ ఉన్న రోల్స్ ఇస్తున్నారు.
కొంతమంది మాత్రం హీరోయిన్ల పాత్రల విషయంలో విభిన్నంగా ఆలోచిస్తుంటారు.
కొందరు దర్శకులు హీరోయిన్లకు ఏదో ఒక ఇబ్బంది పెట్టకుండా సినిమాలు తీయరు.అలాంటి డైరెక్టర్లు ఎవరో తెలుసుకుందాం పదండి.
కె.రాఘవేంద్ర రావు
తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడిగా వెలుగొందిన కె.రాఘవేంద్ర రావు ( Kovelamudi Raghavendra Rao )50 ఏళ్లకు పైగా దర్శకుడిగా పని చేశాడు.వందకు పైగా సినిమాలను డైరెక్ట్ చేశాడు.
ఈ అన్ని సినిమాలలోనూ ఆయన హీరోయిన్లను ఇబ్బంది పెట్టాడు.హీరోయిన్ల బొడ్డు, ఎద, బుగ్గలు, తొడలు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని భాగాలపైన రాఘవేంద్రరావు పండ్లతో కొడుతూ వారికి ఇరిటేషన్ తెప్పించే వాడట.ఒకవేళ తెలుగు స్టేట్స్ లో ఫ్రూట్స్ దొరకకపోతే వేరే స్టేట్స్ నుంచి అయినా ఫ్రూట్స్ తెప్పించి వాళ్లపై విసురుతాడు కానీ ఆ పని చేయకుండా మాత్రం ఉండలేడు.
బోయపాటి శ్రీను
బోయపాటి శ్రీను( Boyapati Srinu ) తమ సినిమాల్లో అందరి హీరోయిన్ల చేత కన్నీళ్లు పెట్టిస్తాడు.లేదంటే హీరోయిన్ల క్యారెక్టర్లను చంపేస్తాడు.దీనివల్ల యాక్ట్రెస్‌లు చాలా ఇన్‌కన్వీనియన్స్‌గా ఫీల్ అవుతారని టాక్.
లోకేష్ కనగరాజ్
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj )కు లవర్స్ అంటే అసలు ఇష్టం ఉండదు.అందుకే తన సినిమాలో ఆ పాత్రలను లేపేస్తాడు.దీని కారణంగా ఆ పాత్రలు చేసేవారు చనిపోవడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది.కొందరైతే చనిపోయే క్యారెక్టర్స్ చేయమని తెగేసి కూడా చెప్పారట.
అట్లీ
తమిళ సినిమా దర్శకుడు అట్లీ తేరి, మెర్సల్, బిగిల్, రాజా రాణి, జవాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.వీటన్నిటిలో కూడా హీరోయిన్ పాత్రలను చాలా కిరాతకంగా లేపేసాడు అట్లీ.
ఇవి కూడా నటీమణులను బాధించేవే అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ ని చంపేస్తేనే సినిమా హిట్ అవుతుంది అనే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశారు.
ఈ డైరెక్టర్ మరి భవిష్యత్తులో కూడా అదే రిపీట్ చేస్తారో లేదో చూడాలి.