మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గింజల్లో అవిసె గింజలు( Flax seeds ) కూడా ఒకటి.అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, ఫోలేట్, జింక్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
రోజుకు వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.అలాగే అందాన్ని పెంచే సత్తా కూడా అవిసె గింజలకు ఉంది.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా అవిసె గింజలను వాడితే మీ స్కిన్ సూపర్ వైట్ గా మరియు బ్రైట్ గా మెరిసిపోతుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టుకున్న అవిసె గింజలను స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు అవిసె గింజలతో ఈ విధంగా ప్యాక్ వేసుకుంటే చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.అలాగే ఈ ప్యాక్ వల్ల స్కిన్ అనేది టైట్ గా మారుతుంది.
మడతలు ఉంటే దూరం అవుతాయి.మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
చర్మం ఆరోగ్యంగా అందంగా మారుతుంది.సహజ మెరుపు మీ సొంతమవుతుంది.