ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్( Talent ) దాగి ఉంటుంది.అది నిరూపించుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భాలలో వారి టాలెంటును నిరూపించుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తారు.
అయితే తాజాగా రాజస్థాన్ కు( Rajasthan ) చెందిన ప్రవీణ్ సైతం అలాంటి ప్రశంసలే పొందాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
భారత్ లోని రాజస్థాన్ కి చెందిన ప్రవీణ్( Praveen ) తాజాగా అమెరికాలో జరుగుతున్న గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నాడు.ఈ టాలెంట్ షోలో భాగంగా ప్రవీణ్ గ్రావిటీ డిఫైయింగ్ డ్యాన్స్ ( Gravity Defying Dance ) చేసి అందరి మన్నలను పొందాడు.
ఈ డాన్స్ లో భాగంగా టీ గాజు గ్లాసులపై నిండుగా ఉన్న నీటి కుండ పెట్టుకుని బ్యాలెన్సింగ్ చేస్తూ ఏమాత్రం తోనకుండా చాలా నైపుణ్యంగా డాన్స్ చేశాడు.

దీంతో అమెరికా న్యాయ నిర్ణేతలకు, ప్రేక్షకులు అందరూకూడా ఒక్కసారిగా ఏం జరుగుతుందోన్న టెన్షన్ తోనే అలానే చూస్తూ ఉండిపోయారు.ఇక ప్రవీణ్ చేసిన గ్రావిటీ డిఫైయింగ్ డ్యాన్స్ కు అమెరికా గాట్ టాలెంట్( America Got Talent ) న్యాయమూర్తులైతే మంత్రముగ్ధులైపోయారు.ఈ సందర్భంగా 10 సంవత్సరాలు వయసు గల ప్రవీణ్ మాట్లాడుతూ.
తన తండ్రి దగ్గర శిక్షణ పొందినట్లు తెలిపాడు.అంతేకాకుండా గత దశాబ్ద కాలంగా రోజుకు రెండు మూడు గంటలు ఈ డాన్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నట్లు, ఇంతకు ముందుకు కూడా రాజస్థానీ భావాయి జానపద నృత్యంతో కూడా ఇండియాస్ గాట్ టాలెంట్‌పై ప్రదర్శన ఇచ్చాడని తెలిపాడు.

ప్రవీణ్ కళ, అతని నైపుణ్య నృత్యం చూసి కిరణ్ ఖేర్, శిల్పాశెట్టి కుంద్రా, బాద్షా, మనోజ్ మునాషీర్ లతో సహా న్యాయనిర్ణేతలందరూ చాలా మెచ్చుకున్నారు.అంతేకాకుండా అతని టాలెంటుకు అక్కడ షోలో ఉన్న ప్రేక్షకులందరూ సీట్స్ లో నుంచి లేసి మరీ చప్పట్లు కొట్టారు.ఈ వీడియో చుసిన కొంతమంది ఇండియా పేరు మార్మోగేలా చేశాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.