తాను చనిపోయినా 10 మంది జీవితాల్లో వెలుగు నింపిన బాలిక.. తల్లీదండ్రులు గ్రేట్ అంటూ?

16 సంవత్సరాల బాలిక తాను చనిపోయినా మదో 10 మంది జీవితాలలో వెలుగు నింపింది.మేడ్చల్ లో( Medchal ) ఈ ఘటన చోటు చేసుకోగా అవయవదానానికి అంగీకరించిన బాలిక కుటుంబ సభ్యులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 Koora Deepika Organs Donated By Her Family Details, Koora Deepika, Koora Deepika-TeluguStop.com

కూర శ్రీనివాస్, సరిత దంపతుల రెండో కూతురు అయిన దీపిక( Deepika ) ఈ నెల 22వ తేదీన ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది.బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్ డెడ్( Brain Dead ) అయిందని వెల్లడించారు.

శరీరంలోని అవయవాలు వైద్యానికి స్పందించడం లేదని తెలిసి తల్లీదండ్రులు అవయవదానానికి( Organ Donor ) అంగీకరించారు.ఈ నెల 25వ తేదీన బాలిక మృతి చెందగా బాలిక అవయవాలతో వైద్యులు పది మంది ప్రాణాలు కాపాడారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.తాను చనిపోయినా పది మంది ప్రాణాలను కాపాడిన దీపికకు ఆత్మశాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Brain, Koora Deepika, Kooradeepika, Koora Srinivas, Medchal, Organ, Sarit

ఫిట్స్ వచ్చిన సమయంలో దీపిక నేలపై కింద పడగా ఆ సమయంలో తలకు బలమైన గాయం అయిందని తెలుస్తోంది.చదువులో తమ కూతురు ముందువరసలో ఉండేదని తమ కూతురు భౌతికంగా మరణించినా పది మందికి మంచి చేసి వాళ్ల రూపంలో ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ఆమె తల్లీదండ్రులు చెప్పుకొచ్చారు.దీపిక తల్లీదండ్రుల ఆలోచనా ధోరణిని సైతం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Telugu Brain, Koora Deepika, Kooradeepika, Koora Srinivas, Medchal, Organ, Sarit

తమ కూతురు మంచి చదువులు చదివి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని భావించిందని దీపిక తల్లీదండ్రులు పేర్కొన్నారు.కూర దీపిక ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.కూర దీపిక తల్లీదండ్రులు వైద్యుల సూచనల మేరకు అవయవ దానానికి అంగీకరించారని సమాచారం అందుతోంది.

కూర దీపిక తల్లీదండ్రులు ఎంతో గ్రేట్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.పలువురు సెలబ్రిటీలు సైతం ఈ మధ్య కాలంలో అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube