ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు నటి సాయి పల్లవి( Sai Pallavi ) .మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న ఈమె ఎప్పటికప్పుడు విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని ఎలాంటి గ్లామర్ పాత్రలకు తావు లేకుండా హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఈమెకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చాయి.ఇక ఒకానొక సమయంలో సాయి పల్లవి ఇండస్ట్రీకి దూరంగా ఉండటంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెబుతున్నారని పెళ్లి చేసుకొని తన వైద్యవృత్తిలో స్థిరపడుతుంది అంటూ వార్తలు వచ్చాయి.

ఈ విధంగా సాయి పల్లవి గురించి ఈ వార్తలు వచ్చిన ప్రతిసారి అవి నిజం కాదని ఈమె నిరూపిస్తూ వచ్చారు.ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా హిందీ తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి తన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.నాకు మహాభారతం( Mahabaratham ) అంటే చాలా ఇష్టం.
మహాభారతం అంటే ఎంతో గౌరవం కూడా ఉంది.

మహాభారతంలో అర్జునుడు( Arjunudu )కుమారుడు అభిమన్యుడు( Abhimanyudu ) అంటే తనకు చాలా ఇష్టమని సాయి పల్లవి వెల్లడించారు.గత 17 ఏళ్లుగా అభిమన్యుడు గురించి అన్ని విషయాలను తెలుసుకుంటున్నాను.పదేళ్లుగా నేను ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాను అంటూ సాయి పల్లవి షాకింగ్ విషయాలను బయట పెట్టడంతో ఈ కామెంట్స్ విన్న అభిమానులు షాక్ అవుతున్నారు.
తన లైఫ్ లో అభిమన్యుడు లాంటి భర్త దొరకాలని ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో తండేల్( Thandel ) అనే సినిమాలో నటిస్తున్నారు.
ఇక హిందీలో రామాయణం తమిళంలో అమరన్ వంటి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.