శరీరానికి శక్తినిచ్చే క్యారెట్.. ఇలా తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన కూరగాయల్లో క్యారెట్( Carrot ) ఒకటి.దుంప జాతికి చెందిన క్యారెట్ ను చాలామంది పచ్చిగానే తింటూ ఉంటారు.

 Adding This Carrot Milkshake In The Diet Is Very Good For Health Details, Carro-TeluguStop.com

ఇంకొందరు క్యారెట్ తో రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు.క్యారెట్ తో చేసే హల్వా ఎంతో మందికి మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అని చెప్పవచ్చు.

ఇకపోతే పోషకాలకు క్యారెట్ పవర్ హౌస్ లాంటిది.క్యారెట్ లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.

అందువ‌ల్ల‌ ఆరోగ్యానికి క్యారెట్ చాలా మేలు చేస్తుంది.

Telugu Almonds, Carrot, Carrot Benefits, Cashew, Tips-Telugu Health

ముఖ్యంగా క్యారెట్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారు.అందుకోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి.అలాగే ప‌ది నైట్ అంతా నానపెట్టి పొట్టు తొలగించిన బాదం గింజ‌లు,( Almonds ) ఐదు నైట్ అంతా నానబెట్టుకున్న జీడిపప్పు,( Cashew ) రెండు గింజ తొలగించిన సాఫ్ట్ డేట్స్, పావు టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పసుపు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

తద్వారా ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన క్యారెట్ మిల్క్ షేక్( Carrot Milkshake ) రెడీ అవుతుంది.

Telugu Almonds, Carrot, Carrot Benefits, Cashew, Tips-Telugu Health

వారానికి కనీసం రెండు సార్లు ఈ క్యారెట్ మిల్క్ షేక్ ను తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.కంటి చూపు పెరుగుతుంది.దృష్టి లోపాలకు దూరంగా ఉంటారు.జీర్ణ‌వ్య‌వ‌స్థ చురుగ్గా ప‌ని చేస్తుంది.అలాగే ఈ క్యారెట్ మిల్క్ షేక్ కాలేయంలో పేరుకుపోయిన‌ టాక్సిన్స్‌ను బయటకు పంపి కొవ్వు మరియు పిత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

బలమైన ఎముకలను నిర్మించడానికి తోడ్ప‌డే కాల్షియం ఈ క్యారెట్ మిల్క్ షేక్ లో మెండుగా ఉంటుంది.

పిల్ల‌లు, పెద్ద‌లు ఈ పానీయాన్ని తీసుకుంటే ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా ఉంటాయి.అంతేకాదు ఈ క్యారెట్ మిల్క్ షేక్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి.

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి స్కిన్ ఏజింగ్ ను ఆల‌స్యం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube