బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం 8వ సీజన్ సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రారంభం కాగా,ఇందులోకి పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు హాజరయ్యారు.
ఇలా బుల్లితెర నటుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో నాగమణికంఠ( Nagamanikanta ) ఒకరు.ఇక ఈయన సీరియల్ బ్యాగ్రౌండ్ తప్ప పర్సనల్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు.
కానీ ఈయన ఏవీ ద్వారా పలు విషయాలను తెలిపారు.రెండేళ్ల వయసులోనే తన తండ్రి చనిపోగా తన తల్లి మరొక పెళ్లి చేసుకుందని తెలిపారు.
కాస్త వయసు వచ్చిన తర్వాత ఆయన స్టెప్ ఫాదర్ అని తెలియగానే తాను యాక్సెప్ట్ చేయలేకపోయానని కొన్నేళ్ళకు అమ్మ క్యాన్సర్ తో మరణించిందని తెలిపారు.

ఇక చదువు పూర్తయిన తర్వాత తాను ఫారిన్ వెళ్ళిపోయానని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యాను.తిరిగి అమ్మ నా కడుపున పుట్టాలని కోరుకున్నట్టే తనకు కూతురు పుట్టిందని కొన్ని కారణాలవల్ల తన భార్య బిడ్డకు కూడా దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు.ఇలా ఈయన అమ్మ చనిపోయిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయానని చెప్పడంతో ఈ విషయాల గురించి నాగమణికంఠ చెల్లెలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నాగమణికంఠ చెల్లెలు కావ్య( Kavya ) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బిగ్ బాస్ వేదికపై మా అన్న నాగమణికంఠ చెప్పిన కొన్ని వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను మా నాన్న గురించి మాట్లాడుతూ స్టెప్ ఫాదర్ అని చెప్పారు.అది అతను నెగిటివ్ వేలో చెప్పలేదు, కేవలం అతని విషయాలను చెప్పుకొచ్చారు.అలాగే మా అమ్మ తదనంతరం అయన ఇంటి నుంచి వెళ్లిపోయారు.అతనిని ఎవరు ఇల్లు వదిలి వెళ్ళిపొమ్మని చెప్పలేదు అది పూర్తిగా తన సొంత నిర్ణయం అని వెల్లడించారు.
మా నాన్న మా జీవితాలకు కావాల్సినంత ప్రేమ అందించారు.పూర్తి సపోర్ట్ చేశారు అయితే ఆ నిర్ణయాలన్నీ కూడా ఆయన వ్యక్తిగతం ఆ నిర్ణయానికి మేము గౌరవం ఇస్తాము అంటూ కావ్య చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.