మొటిమల తాలూకు గుర్తులు ముఖంపై అలానే ఉంటున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

సాధారణంగా కొందరికి మొటిమలు( Acne ) పోయిన వాటి తాలూకు గుర్తులు మాత్రం ముఖంపై అలానే ఉండిపోతాయి.ఆ మచ్చలు ముఖంలో మెరుపును మాయం చేస్తాయి.

 Follow These Simple Tips To Get Rid Of Acne Scars Details, Acne Scars, Acne Mar-TeluguStop.com

అందాన్ని దెబ్బతీస్తాయి.ఈ క్రమంలోనే మొటిమలు తాలూకు మచ్చలను వదిలించుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు.

అయితే మార్కెట్లో లభ్యమయ్యే క్రీముల వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ మాత్రం మీకు చాలా బాగా సహాయపడతాయి.

ఈ టిప్స్ మొటిమల తాలూకు మచ్చలను వేగంగా వదిలిస్తాయి.అందాన్ని రెట్టింపు చేస్తాయి.

మరి ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Acne, Acne Scars, Tips, Curry Powder, Skin, Honey, Latest, Saffron, Skin

టిప్ 1: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి,( Curry Leaves Powder ) చిటికెడు పసుపు మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను రెగ్యులర్ గా పాటించడం వల్ల మొటిమలు, వాటి తాలూకు మ‌చ్చ‌లు పరారవుతాయి.

స్పాట్ లెస్ స్కిన్( Spotless Skin ) మీ సొంతం అవుతుంది.

Telugu Acne, Acne Scars, Tips, Curry Powder, Skin, Honey, Latest, Saffron, Skin

టిప్ 2: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె,( Honey ) చిటికెడు కుంకుమ పువ్వు( Saffron ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.15 నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ చిట్కాను పాటించిన కూడా ముఖంపై మచ్చలు మాయం అవుతాయి.చర్మం కాంతివంతంగా మారుతుంది.

Telugu Acne, Acne Scars, Tips, Curry Powder, Skin, Honey, Latest, Saffron, Skin

టిప్ 3: ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూది సహాయంతో మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కా కూడా మొటిమలు తాలూకు మచ్చలను పోగొడుతుంది.చర్మానికి కొత్త మెరుపును అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube