ఇండస్ట్రీ కి తొలి నట వారసుడు, రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన నందమూరి వారసుడు..?

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం లేదా నెపోటిజం అనేది చాలా కామన్.ఒకరు ఫిలిం ఇండస్ట్రీలో స్థిరపడితే వారి కుటుంబ సభ్యులకు ఇండస్ట్రీలో ఈజీగా ఎంట్రీ పాస్ లభిస్తుంది.

 First Nandamuri Heir From Ntr Family Nandamuri Harikrishna Details, First Nandam-TeluguStop.com

ఎంట్రీ వరకైతే ఈజీ కానీ తర్వాత సక్సెస్ కావడం వారి ప్రతిభ, కృషి, తెలివి పైనే ఆధారపడి ఉంటుంది.నందమూరి కుటుంబం( Nandamuri Family ) నుంచి వచ్చిన వాళ్లలో అలాంటి టాలెంట్ లేక చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కాలేకపోయారు.

అతిపెద్ద మంది మాత్రమే సినిమాల్లో సెటిల్ కాగలిగారు.వారెవరు అంటే ముందుగా మనకు బాలకృష్ణనే గుర్తుకు వస్తారు.

కానీ ఆయన కంటే ముందే ఎన్టీఆర్ నట, రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టిన వారు మరొకరు వున్నారు.ఆయనే హరికృష్ణ.

( Harikrishna )

టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి నట వారసుడు ఎవరంటే హరికృష్ణ పేరే వినిపిస్తుంది.ఎందుకంటే అప్పటివరకు తెలుగులో ఏ స్టార్ హీరో కుమారుడు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

హరికృష్ణ 1956, సెప్టెంబర్‌ 2న ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించారు.మొట్టమొదటిగా ‘శ్రీకృష్ణావతారం (1967)’( Sri Krishnavataram ) సినిమాలో బాలకృష్ణుడిగా నటించి సిల్వర్‌స్క్రీన్‌కి పరిచయమయ్యారు.

దీని తర్వాత తల్లా పెళ్లామా, తాతమ్మ కల, రామ్‌రహీమ్‌ సినిమాల్లో అద్భుతంగా నటించి వావ్ అనిపించారు.

Telugu Balakrishna, Basavatarakam, Nandamuri Heir, Hari Krishna, Jr Ntr, Lahiril

ఎన్టీఆర్ డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన “దానవీరశూర కర్ణ”( Daana Veera Sura Karna ) సినిమాలో హరికృష్ణ అర్జునుడి వేషంలో తన నట విశ్వరూపం చూపించారు.ఆ తర్వాత ఇంకెన్ని మంచి పాత్రలు పోషిస్తారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు కానీ వారిని హరికృష్ణ డిసప్పాయింట్ చేశారు.యాక్టింగ్ మానేసి ప్రొడ్యూసర్‌గా మారారు.

సొంత బేనర్‌లో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు.హరికృష్ణ నిర్మించిన ఫస్ట్ మూవీ ‘డ్రైవర్‌ రాముడు’. తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన “పట్టాభిషేకం”, “అనసూయమ్మగారి అల్లుడు”, “తిరగబడ్డ తెలుగుబిడ్డ”, “పెద్దన్నయ్య” సినిమాల ప్రొడక్షన్స్‌లో పాలుపంచుకున్నారు.21 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ “శ్రీరాములయ్య” ( Sri Ramulayya ) సినిమాలో వైవిధ్యమైన పాత్రలో నటుడిగా కంబ్యాక్ ఇచ్చారు.

Telugu Balakrishna, Basavatarakam, Nandamuri Heir, Hari Krishna, Jr Ntr, Lahiril

ఆ వెంటనే వై.వి.ఎస్‌.చౌదరి తీసిన ‘సీతారామరాజు’( Sitaramaraju ) మూవీలో ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేసి బాక్సాఫీస్‌ని షేర్ చేశారు.

ఈ హిట్ తర్వాత ‘లాహిరి లాహిరి లాహిరిలో’( Lahiri Lahiri Lahirilo ) సినిమా చేశారు.ఇందులోనూ హరికృష్ణ ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్ పోషించగా.ఆయన ఇమేజ్‌ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయింది.దీని తర్వాత శివరామరాజు, సీతయ్య, టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌, స్వామి వంటి సినిమాతో బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ అందుకున్నారు.

హరికృష్ణ స్టార్ హీరోగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.సూపర్ స్టార్ కృష్ణతో కలిసి చేసిన శ్రావణమాసం చిత్రం మాత్రం ఫ్లాప్ అయ్యింది.

అదే హరికృష్ణకు ఆఖరి సినిమా అయ్యింది.

Telugu Balakrishna, Basavatarakam, Nandamuri Heir, Hari Krishna, Jr Ntr, Lahiril

ఇక అప్పట్లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజల సమస్యలు వినేవారు.దాని కోసం చైతన్య రథం వెహికల్ కూడా ఉపయోగించారు.దీన్ని హరికృష్ణనే డ్రైవ్ చేశారు.

హరికృష్ణ మొత్తంగా 75,000 కి.మీ ఆ వాహనాన్ని నడిపి చరిత్ర సృష్టించారు.1995లో అధికార మార్పిడి జరిగాక సొంత తండ్రికే వ్యతిరేకమయ్యారు హరికృష్ణ.చంద్రబాబుకి మద్దతు తెలిపారు.ఆ విషయం అటుంచితే అప్పటి ప్రభుత్వంలో హరికృష్ణ రవాణాశాఖ మంత్రిగా సేవలందించారు.1996లో తండ్రి మరణాంతరం హిందూపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగరేశారు.2008లో రాజ్యసభ సభ్యుడిగా కూడా సెలక్ట్ అయ్యారు.2013లో రాష్ట్ర విభజనను తీవ్రంగా ఖండించారు అంతేకాదు రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు.అలా ఈ నందమూరి వారసుడు రాజకీయాల్లో, సినిమాల్లో తనదైన ముద్ర వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube