తాను చనిపోయినా 10 మంది జీవితాల్లో వెలుగు నింపిన బాలిక.. తల్లీదండ్రులు గ్రేట్ అంటూ?

16 సంవత్సరాల బాలిక తాను చనిపోయినా మదో 10 మంది జీవితాలలో వెలుగు నింపింది.

మేడ్చల్ లో( Medchal ) ఈ ఘటన చోటు చేసుకోగా అవయవదానానికి అంగీకరించిన బాలిక కుటుంబ సభ్యులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

కూర శ్రీనివాస్, సరిత దంపతుల రెండో కూతురు అయిన దీపిక( Deepika ) ఈ నెల 22వ తేదీన ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది.

బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్ డెడ్( Brain Dead ) అయిందని వెల్లడించారు.

శరీరంలోని అవయవాలు వైద్యానికి స్పందించడం లేదని తెలిసి తల్లీదండ్రులు అవయవదానానికి( Organ Donor ) అంగీకరించారు.

ఈ నెల 25వ తేదీన బాలిక మృతి చెందగా బాలిక అవయవాలతో వైద్యులు పది మంది ప్రాణాలు కాపాడారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.తాను చనిపోయినా పది మంది ప్రాణాలను కాపాడిన దీపికకు ఆత్మశాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"""/" / ఫిట్స్ వచ్చిన సమయంలో దీపిక నేలపై కింద పడగా ఆ సమయంలో తలకు బలమైన గాయం అయిందని తెలుస్తోంది.

చదువులో తమ కూతురు ముందువరసలో ఉండేదని తమ కూతురు భౌతికంగా మరణించినా పది మందికి మంచి చేసి వాళ్ల రూపంలో ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ఆమె తల్లీదండ్రులు చెప్పుకొచ్చారు.

దీపిక తల్లీదండ్రుల ఆలోచనా ధోరణిని సైతం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. """/" / తమ కూతురు మంచి చదువులు చదివి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని భావించిందని దీపిక తల్లీదండ్రులు పేర్కొన్నారు.

కూర దీపిక ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.కూర దీపిక తల్లీదండ్రులు వైద్యుల సూచనల మేరకు అవయవ దానానికి అంగీకరించారని సమాచారం అందుతోంది.

కూర దీపిక తల్లీదండ్రులు ఎంతో గ్రేట్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

పలువురు సెలబ్రిటీలు సైతం ఈ మధ్య కాలంలో అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు.

పాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎవరెవరు తినకూడదో తెలుసా?