స్పెయిన్ సీక్రెట్ రివీల్డ్: 6,000-ఇయర్-ఓల్డ్ బ్రిడ్జ్ వెలుగులోకి..?

స్పెయిన్( Spain ) దేశంలోని మల్లార్కా ద్వీపంలోని జెనోవేసా అనే గుహలో( Genovesa Cave ) శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని కనుగొన్నారు.అది నీటి అడుగున దాగి ఉన్న, 6000 సంవత్సరాల నాటి పాత రాతి వంతెన!( Ancient Stone Bridge ) ఈ ఓల్డ్ బ్రిడ్జ్ దాదాపు 25 అడుగుల పొడవు ఉంది.

 6000-year-old Stone Bridge Indicates Early Human Arrival In Spain Mallorca Detai-TeluguStop.com

అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బోగ్దాన్ ఒనాక్, ఆయన బృందం ఈ వంతెన వయసును అంచనా వేశారు.ఇంత పాత వంతెన లభించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.

ఎందుకంటే, ఇంతకు ముందు జరిపిన పరిశోధనల ప్రకారం మనుషులు మల్లార్కా ద్వీపంలో( Mallorca Island ) 4,440 సంవత్సరాల క్రితమే స్థిరపడ్డారని భావించేవారు.

కానీ ఈ కొత్త ఆవిష్కరణ ప్రకారం మనుషులు ఆ ద్వీపంలో మనం అనుకున్నదానికంటే చాలా ముందుగానే ఉండేవారని తెలుస్తోంది.

ఈ ఆవిష్కరణ గురించి ‘కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు.వంతెన ఎప్పుడు నిర్మించబడిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు వంతెన చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశోధించారు.

సముద్రం ఎంత ఎత్తుకు తగ్గింది, వంతెన మీద ఏయే రసాయనాలు ఏర్పడ్డాయి అనే విషయాలను పరిశోధించారు.ఈ పరిశోధనల ద్వారా వంతెన 6000 ఏళ్ల నాటిదని తెలుసుకున్నారు.

Telugu Stone Bridge, Discovery, Humans, Genovesa Cave, Island, Mallorca, Nri, Sp

ఈ వంతెన మొదట 2000 సంవత్సరంలో కనుగొనబడింది.కానీ మొదట శాస్త్రవేత్తలు దీని వయసు 3500 ఏళ్లే అనుకున్నారు.దానికి కారణం దాని సమీపంలో కనుగొన్న మట్టి పాత్రలు. తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో మనుషులు 9000 ఏళ్ల క్రితమే ఉండేవారని చెప్పారు.కానీ వాళ్లకు రిటన్ రికార్డులు లేవు, తగిన ఆధారాలు కూడా లేవు కాబట్టి దీన్ని నిర్ధారించలేకపోయారు.

Telugu Stone Bridge, Discovery, Humans, Genovesa Cave, Island, Mallorca, Nri, Sp

ఇప్పుడు ఈ కొత్త పరిశోధనతో శాస్త్రవేత్తలు( Scientists ) ఆ ప్రాంతంలో మనుషులు ఎప్పుడు నివసించారనే విషయంలో అవగాహన మారింది.వంతెన అనుకున్నదానికంటే చాలా పాతదని నిర్ధారించారు.ఈ కొత్త ఆవిష్కరణ ఆ ప్రాంతంలో మనుషుల చరిత్రను మనం మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

ప్రొఫెసర్ బోగ్దాన్ ఒనాక్ సీఎన్ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, “ఈ నీటి అడుగున ఉన్న వంతెన, ఇతర వస్తువుల ఆవిష్కరణ, ప్రాచీన మనుషులు చాలా తెలివైన వారని, ముందుగానే ప్రణాళిక చేసేవారని చూపిస్తుంది.గుహలోని నీటి వనరులను బాగా ఉపయోగించుకోవడానికి వారు ఈ రకమైన నిర్మాణాలు చేశారు” అని చెప్పారు.

ఈ విషయాలను నిర్ధారించుకోవడానికి, మల్లార్కా ద్వీపంలో మనుషులు మొదట ఎప్పుడు వచ్చారో తెలుసుకోవడానికి పరిశోధకులకు నాలుగు సంవత్సరాలు పట్టింది.

ఈ వంతెన పెద్ద పెద్ద భారీ రాతి ముక్కలతో నిర్మించబడింది.

కానీ ప్రాచీన మనుషులు దీన్ని ఎలా నిర్మించారో ఇప్పటికీ తెలియదు.ఈ వంతెనను గుహలోని ప్రవేశ ద్వారం నుండి ఒక చెరువుకు ఆవలి వైపు ఉన్న గదికి వెళ్లడానికి ఒక పొడి దారిని సృష్టించడానికి నిర్మించారని పరిశోధకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube