ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.మరీ ముఖ్యంగా విజయవాడ( Vijayawada ) ఒక నదిని సముద్రాన్ని తలపిస్తోంది.
దాదాపు రెండు అంతస్తుల మేర ఇల్లు మునిగిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే కొందరు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోగా మరి కొందరు ఇళ్ల మేడ పైకి ఎక్కి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
ఎటు చూసినా వర్షం నీరు కావడంతో తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు.
ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోతున్నారు.ప్రస్తుతం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.వరద ప్రాంతాల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లు( Cellars of apartments ) పూర్తిగా మునిగిపోయి కార్లు, ద్విచక్ర వాహనాలు కాగితం పడవల్లా తేలియాడుతున్నాయి.
పై అంతస్తుల్లో ఉన్న వారంతా రెండ్రోజులుగా గడప దాటే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు.ప్రభుత్వ సాయం అందక చాలామంది అల్లాడిపోతున్నారు.తమ వీధుల వెంట వెళ్తున్న వార్ని గుండెలవిసేలా పిలుస్తూ.తమను ఆదుకోండి అంటూ ఆర్తిగా కోరుతున్నారు.
ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబాన్ని కాపాడాలని బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజా ( Tasty Teja of Bigg Boss fame )కోరారు.ఈ క్రమంలో ఒక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.పసిపిల్లలు,మహిళలు,వృద్ధులు వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయామని వీడియోలో బాధితుడు తెలిపాడు.ఏపీ ప్రభత్వం లేదా విజయవాడలోని ఎవరైన తమను కాపాడాలని కోరారు.రెండు రోజులుగా పిల్లలకు పాలు, ఆహారం కూడా లేదని వాపోయారు.చాలామంది అధికారులకు మెసేజ్ చేసినా ఫలితం లేదని ఆయన తెలిపారు.
దయచేసి తమను కాపాడాలని వారు వేడుకున్నారు.టేస్టీ తేజా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మరోవైపు ప్రభుత్వాలు కూడా వరద బాధితులను ఆదుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.చాలామంది వరద బాధితుల కోసం కోట్లకు కోట్లు లక్షలకు లక్షలు విరాళాలు కూడా ఇస్తున్నారు.