కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఏడాది ఆగస్టు నెలలో టాలీవుడ్( Tollywood ) కి షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.మిగతా నెలలతో పోల్చుకుంటే ఆగస్టు నెలలో ఊహించని విధంగా ఫలితాలు వస్తున్నాయి.
ఇక 2022 ఆగస్టులో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా నటించిన టైగర్ సినిమా( Tiger movie ) ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు.దాన్నుంచి ఇంకా చాలామంది తేరుకోలేదు.
ఆ రేంజ్ లో దెబ్బ కొట్టింది లైగర్.కొంతమంది బయ్యర్లు, ఎగ్జిబిటర్లను నిలువునా ముంచేసింది.
ఇప్పటికీ ఆ సినిమా షాక్, కొంతమందిని షేక్ చేస్తూనే ఉంది.తర్వాత 2023 ఆగస్ట్ లో కూడా బిగ్ షాక్ ఉంది.
ఈసారి భోళాశంకర్ వంతు.
చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన ఈ సినిమా ఊహించని పరాజయం పాలైంది.ఇంకా చెప్పాలంటే చిరంజీవి ఇమేజ్ కే మచ్చ తెచ్చేంతలా డ్యామేజ్ చేసింది భోళాశంకర్.ఈ సినిమా.
కూడా బయర్లను నిలువునా ముంచేసింది అని చెప్పాలి.ఇది ఏ రేంజ్ ఫ్లాప్ అంటే, నిర్మాత తన ఆస్తులు కూడా అమ్ముకున్నాడనే ప్రచారం జరిగింది.
తర్వాత దాన్ని ప్రొడ్యూసర్ ఖండించారు.తర్వాత అదే ఏడాది ఆగస్ట్ లో వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున ( Gandhi’s Arjuna )కూడా భారీ డిజాస్టర్ అయింది.
ఇక ఈ ఏడాది ఆగస్ట్ లో రెండు షాక్ లు.ఒకటి డబుల్ ఇస్మార్ట్.రెండోది మిస్టర్ బచ్చన్( Mr.Bachchan ).ఈ సారి రవితేజ ఇమేజ్ నే దెబ్బకొట్టే రేంజ్ లో, అతడి స్టోరీ సెలక్షన్ ను అనుమానించే విధంగా డిజాస్టర్ అయింది మిస్టర్ బచ్చన్ సినిమా.
హరీశ్ శంకర్ డైరక్ట్ చేసిన ఈ మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.ఇక రామ్, పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ది కూడా ఇదే పరిస్థితి.కథలో డెప్త్ లేదు, కథనంలో గ్రిప్ లేదు, మాటల్లో పూరి మార్క్ లేదు.
పాటలు తప్ప మిగతావన్నీ తేలిపోవడంతో డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ ఫ్లాప్ అనిపించుకుంది.ఇలా కరోనా తర్వాత ప్రతి ఏటా ఆగస్ట్ లో షాకులు తగుల్తూనే ఉన్నాయి.
నిజానికి ఈ నెలల్లో మరికొన్ని విజయాలు ఉన్నప్పటికీ, ఊహించని ఎదురుదెబ్బలు మాత్రం కామన్ అయ్యాయి.వచ్చే ఏడాదైనా ఈ పద్ధతి మారుతుందేమో చూడాలి మరి.