జగన్ పై నాగబాబు సెటైర్లు .. ' దీన్నే అంటారు సార్ ' 

ప్రస్తుతం ఏపీలో వరదలు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.టిడిపి,  వైసిపిలు ( TDP, YCP )ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వరద సాయం పైన,  ముందస్తు చర్యలు తీసుకోకపోవడం పైన అనేక విమర్శలు చేసుకుంటూ ఉండగా,  తాజాగా జనసేన నాయకుడు,  పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పై వైసీపీ అధినేత జగన్( Jagan ) పై అనేక సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.

 Nagababu Satires On Jagan This Is Called Sir, Jagan,ap Cm Jagan, Ap Government,-TeluguStop.com
Telugu Ap Cm Jagan, Ap Floods, Ap, Jagan, Janasena, Nagababu, Ysrcp-Politics

‘ కృష్ణానది వరదలు విజిట్ కు వచ్చి , వరదల్ని man made disaster అని సెలవిచ్చారు.ఒకసారి క్రింది ఉంది చదవండి జగన్ .మూడేళ్ల క్రితం (2021 ) అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు.15 మంది జడ తెలియలేదు.  ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.వందలాది పశువులు చనిపోయాయి .ఎటు చూసినా కూలిన ఇళ్లు , ఇంకా గుడారాల మధ్యనే అనేకమంది నివాసం ఉంటున్నారు.చెయ్యేరులు పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతార.

  అందుకోసం నదిలో లారీలు దిగుతాయి.  డ్యామ్ గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి.

  కాబట్టి వాటిని పైకి తరలించే వరకు డ్యామ్ గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారు అనేది ప్రధాన ఆరోపణ.రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు గేటు ( Annamaiya project gate )కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ ( Minister Gajendra Singh Shakawat )పార్లమెంటులో అన్నారు.

Telugu Ap Cm Jagan, Ap Floods, Ap, Jagan, Janasena, Nagababu, Ysrcp-Politics

దీనినే అంటారు సార్  man made disaster అని, ఒకసారి మీరు Frist class student కాబట్టి natural disaster కు ,man made disaster కు తేడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను.మీరు డ్యామ్ గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వల్ల , మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వల్ల జరిగిన అన్నమయ్య డ్యాం కొట్టుకపోవడాన్ని అంటారు man made disaster అని గమనించగలరు జగన్.వీలైతే ముంపు ప్రాంతాలలో పర్యటించి , వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితులని ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంది.విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బాగుంటుంది అని విన్నవిస్తున్నాను ‘ అంటూ నాగబాబు జగన్ కు సూచనలతో కూడిన సెటైర్లు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube