దుర్భర పరిస్ధితుల్లో అద్దెదారులు.. పట్టించుకోరా , యూకేలో భారత సంతతి ఎంపీపై విమర్శలు

బ్రిటీష్ ఇండియన్ నేత, లేబర్ పార్టీ ఎంపీ జస్ అథ్వాల్‌కు ( MP Jas Athwal )సంబంధించి అంతర్జాతీయ వార్తాసంస్థ బీబీసీ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది.అథ్వాల్‌ యాజమాన్యంలోని భవనాల్లో నివసిస్తున్న అద్దెదారులు ఈగలు, చీమల( Flys, ants ) బారినపడి దుర్భరమైన పరిస్ధితుల్లో నివసిస్తున్నారని బీబీసీ ఆరోపించింది.

 British-indian Labour Mp Jas Athwal Accused Of Renting Flats Infested With Fleas-TeluguStop.com

ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన అథ్వాల్‌ను మురికివాడల భూస్వామి అంటూ అభివర్ణించింది.

లండన్‌లోని అథ్వాల్‌‌కు చెందిన 15 భవనాల్లోని కొన్నింటిలో అద్దెదారులు అత్యంత అధ్వాన్నమైన పరిస్ధితుల్లో నివసిస్తున్నారని బీబీసీ తెలిపింది.

ఈ 15 ఫ్లాట్‌లకు యజమానిగా.యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో( UK House of Commons ) అతిపెద్ద భూస్వామిగా అథ్వాల్ నిలిచాడు.భారత్‌లోని పంజాబ్‌లో జన్మించిన అథ్వాల్ 1970లో తన కుటుంబంతో కలిసి యూకేలోని ఇల్‌ఫోర్డ్‌కు వలస వచ్చారు.2010 నుంచి స్థానికంగా కౌన్సిలర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.గతంలో రెడ్‌బ్రిడ్జ్ లండన్ బోరో కౌన్సిల్‌కు నాయకుడిగా పనిచేశారు.

Telugu Britishindian, Flys, India, Mp Jas Athwal, Punjab, Uk-Telugu Top Posts

బీబీసీ విలేకరి ఒకరు ఈస్ట్ లండన్‌లోని రెడ్ బ్రిడ్జ్‌లోని ఒక దుకాణం వద్ద అథ్వాల్‌కు చెందిన ఫ్లాట్‌లను సందర్శించారు.ఇక్కడ బాత్రూమ్ పైకప్పులపై నల్లటి అచ్చులు, చీమలు, విరిగిన లైట్లు, జారిపోతూ వేలాడుతున్న ఫైర్ అలారంలు వేలాడుతూ కనిపించాయి.ఓ చోట మెట్ల దగ్గర వాషింగ్ మెషీన్ కూడా పడేశారు.

ఎక్కడ చూసినా చీమలే ఉన్నాయని ఓ అద్దెదారుడు సదరు ప్రతినిధికి చెప్పాడు.అథ్వాల్ కానీ అతని ఆస్తుల్ని పర్యవేక్షిస్తున్న ఏజెంట్ కానీ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని.

ప్రశ్నిస్తే బయటకు పంపేస్తారేమోనని వారు భయపడుతున్నారు.

Telugu Britishindian, Flys, India, Mp Jas Athwal, Punjab, Uk-Telugu Top Posts

రెడ్‌బ్రిడ్జ్ కౌన్సిల్‌కు( Redbridge Council ) నాయకత్వం వహిస్తున్నప్పుడు తాను అమలు చేసిన పథకం ప్రకారం తన ఫ్లాట్‌లకు సరైన ప్రాపర్టీ లైసెన్స్‌లు లేవని అథ్వాల్ అంగీకరించారు.రెడ్‌బ్రిడ్జ్ కన్జర్వేటివ్స్ నాయకుడు పాల్ కెనాల్ మాట్లాడుతూ.అథ్వాల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కథనంపై స్పందించిన ఎంపీ అథ్వాల్.తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube