సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సెప్టెంబర్ రెండవ తేదీ పుట్టినరోజు( Pawan Kalyan Birthday ) వేడుకలను జరుపుకున్నారు.ఇలా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఎంతో మంది అభిమానులు సినిమా సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇకపోతే మెగా చిన్న కోడలు లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున పురస్కరించుకొని ఈమె ఆయన ఫోటోని షేర్ చేస్తూ.హ్యాపీ బర్త్ డే మావయ్యా( Happy Birthday Mavayya ) .మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ,ఆరోగ్యంగా ఉండాలని.ఇలాగే అందరికీ ఇన్‌స్పైర్ చేయాలని కోరుకుంటున్నట్లు ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
లావణ్య త్రిపాఠి పవన్ కళ్యాణ్ ని మామయ్య అని పిలవడంతో అభిమానులు ఎంతో ఫిదా అవ్వడమే కాకుండా మీరు మామయ్య అని పిలుస్తూ ఉంటే ఎంతో వినసొంపుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటేనే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి.ఈ ఏడాది పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడిగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున అభిమానులు ఈయన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
పవన్ పుట్టిన రోజున పురస్కరించుకొని గబ్బర్ సింగ్ సినిమాని తిరిగి విడుదల చేయగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు ఈ సినిమాని చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశారు.