తాజాగా సెప్టెంబర్ రెండవ తేదీన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమా థియేటర్లలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.దీంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.
ఈ సినిమాను గతంలో చాలా సార్లు చూసినప్పటికీ మరోసారి ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద క్యూలు కట్టారు.అయితే గతంలో ఈ సినిమా రెండు మూడు సార్లు విడుదల అయిన విషయం తెలిసిందే.
దాంతో ఈసారి వసూళ్లు భారీగా ఉండకపోవచ్చు ఏమో అని అందరూ అనుమానపడ్డారు.
కానీ గబ్బర్ సింగ్ సినిమా( Gabbar Singh movie ) మాత్రం పటాపంచలు చేసింది.పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల మీదకు సునామిలా విరుచుకుపడ్డారు.హైదరాబాద్ లాంటి మెట్రో సిటీతో మొదలుపెట్టి మచిలీపట్నం లాంటి పట్టణం దాకా ఎక్కడ చూసినా ఒకటే హోరు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం వర్షాలను లెక్క చేయకుండా అభిమానులు గబ్బర్ సింగ్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి పోటెత్తారు.గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఓపెనింగ్ డే సుమారు 6 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది.
ఇది ఇప్పటిదాకా రీ రిలీజ్ కాబడిన సినిమాల్లో అత్యధిక నెంబర్.
ఏపీ తెలంగాణ కలిపి 1400 షోలకు పైగా ప్రదర్శిస్తే తెలుగు రాష్ట్రాల నుంచే 5 కోట్ల గ్రాస్ దాటేసింది.ప్రసాద్ మల్టీప్లెక్స్, సంధ్య కాంప్లెక్స్( Prasad Multiplex, Sandhya Complex ) లాంటి పేరు పొందిన థియేటర్ సముదాయాలలో పది లక్షలకు పైగా వసూలైనట్టు తెలిసింది.ఇండియా మొత్తం మీద పద్దెనిమిది వందలకు పైగా షోలు వేస్తే కర్ణాటకలో హౌస్ ఫుల్స్ నమోదు కాగా పరిమిత ఆటలతో తమిళనాడులో కూడా దుమ్ము దులిపింది.
మొత్తంగా చూస్తే ఇప్పట్లో గబ్బర్ సింగ్ ని టచ్ చేయడం అసాధ్యం అనేలా ఊచకోత జరిగింది.మురారిని దాటాలనుకున్న లక్ష్యం సులభంగా నెరవేరుతోంది.ఈ రోజు నుంచి దాదాపు అన్ని చోట్ల గబ్బర్ సింగ్ ని కొనసాగిస్తున్నారు.ఇదే దూకుడు ఉండకపోవచ్చు కానీ డీసెంట్ ఆక్యుపెన్సీలు అయితే ఖచ్చితంగా ఉంటాయట.
వీకెండ్ దాకా అనుమానమే.సెప్టెంబర్ 5 నుంచి వరసగా కొత్త సినిమాలు క్యూ కట్టాయి కనక గబ్బర్ సింగ్ ఏ మేరకు నెట్టుకొస్తాడో చూడాలి మరి.