తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యాచో స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు గోపీచంద్( Actor Gopichand )… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతున్న నేపథ్యంలో శ్రీను వైట్ల డైరెక్షన్ చేస్తున్న విశ్వం సినిమా( Vishwam movie ) మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఇక ఈ సినిమా నుంచి ఈరోజు టీజర్ అయితే రిలీజ్ అయింది.ఈ టీజర్ చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వాళ్ల మన్ననలను పొందుతుంది.
శ్రీను వైట్ల ( Srinu Whitela )కామెడీని కూడా ఈ సినిమాలో చాలావరకు చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక వెంకి సినిమాలోని ట్రైన్ కామెడీ సీన్స్ ని కూడా ఇందులో రీ క్రియేట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న వరుస సినిమాలు డిజాస్టర్ గా మారుతున్న నేపథ్యంలో గోపీచంద్ శ్రీనువైట్లతో సినిమాను చేస్తూ రిస్క్ చేస్తున్నాడు అంటు కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.కానీ ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ మంచి సక్సెస్ కోసం ఇద్దరు పరితపిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా టీజర్ ని కనక చూసినట్లయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ అయితే అందరిలో ఉంది.
ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People’s Media Factory ) మీద ఈ సినిమా నిర్మిస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.రీసెంట్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ప్రొడ్యూసర్ టిజి విశ్వనాధ్ కూడా కొరుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
.