హిజాబ్ ధరించలేదని యువతిని వెంటాడిన ముస్లిం వ్యక్తి.. చివరికి..?

అఫ్గానిస్తాన్‌ వంటి కొన్ని ముస్లిం కంట్రీస్‌లో అమ్మాయిలు వారికి ఇష్టం లేకపోయినా హిజాబ్, బురఖా, క్యాప్, నఖాబ్‌లు వంటి వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.ఇక్కడి అమ్మాయిలకు తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు.

 Woman Chased Harassed For Not Wearing Hijab In Germany Viral Video Details, Dist-TeluguStop.com

హిజాబ్( Hijab ) ధరించకుండా బయట కనపడితే చాలు దారుణంగా హింసిస్తారు.కొన్ని సందర్భాల్లో చంపేస్తారు కూడా.

ఈ ముస్లిం కంట్రీస్‌ పీపుల్ తమ దేశాల్లోనే కాకుండా వేరే దేశాల్లో కూడా అమ్మాయిలను హిజాబ్ ధరించాలని బలవంతం చేశారు.

తాజాగా జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో( Berlin ) ఇలాంటి ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది.

హిజాబ్ ధరించకపోవడం వల్ల ఓ మహిళను ఒక వ్యక్తి వెంటాడి హింసించాడు.ఈ ఘటనను ఆ మహిళ స్వయంగా వీడియో తీసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌ జర్నలిస్ట్, మహిళా హక్కుల కార్యకర్త మసిహ్ అలినేజాద్( Masih Alinejad ) ఈ ఘటన వీడియోను X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.‘నమ్మశక్యం కాని విషయం కానీ నిజమే!జర్మనీలో( Germany ) ఇప్పుడు మనం ‘మోరల్ పోలీస్’ లాంటి వాళ్లను చూస్తున్నాం.బెర్లిన్‌లో ఒక ముస్లిం మతస్థుడు( Muslim ) ఇద్దరు మహిళలను వారి ‘హిజాబ్ సరిగా లేదని’ వెంటాడుతూ, ఎలా దుస్తులు వేసుకోవాలో చెబుతున్నాడు.’ అని ఆమె తన పోస్ట్‌లో జోడించారు.

‘ఇది కేవలం వేధింపు మాత్రమే కాదు, ఇది ఇరాన్, అఫ్గానిస్తాన్‌లలో మనం ఎదుర్కొన్న హిజాబ్ రూల్స్‌ను గుర్తు చేస్తుంది.ఇప్పుడు ఇది యూరప్‌ హృదయ భాగంలో పాతుకుపోతోంది’ అని అలినేజాద్ రాశారు.అలినేజాద్ ఇంకా మాట్లాడుతూ ‘ఈ విధమైన రూల్స్‌ను విమర్శించే వాళ్లను ‘ఇస్లామోఫోబియా’ ఆరోపణలతో సైలెంట్ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇది వ్యతిరేకతను అణచివేయడానికి ఉద్దేశించిన ఒక ధోరణి, అణచివేత ప్రాథమిక సమస్యలను పరిష్కరించడానికి కాదు.జర్మనీలో మహిళలకు సేఫ్టీ లేదు.’ అని అన్నారు.

“జర్మనీలో ‘మోరల్ పోలీస్'( Moral Police ) ఉన్నారని నేను చెప్పినప్పుడు, నేను ‘షరియా పోలీస్’ అని పిలుచుకునే వారి గురించి చెబుతున్నాను.వీరు తమను తాము షరియా చట్టాన్ని అమలు చేసేవారని అనుకుంటారు” అని అలినేజాద్ వివరించారు.

“ఒక ముస్లిం మనిషి ఇద్దరు మహిళలను ‘సరిగా’ దుస్తులు ధరించలేదని వేధిస్తున్న వీడియోను నేను ప్రచురించినప్పటి నుండి, ఇలాంటి ఘటనల గురించి నివేదికలు లేదా ప్రత్యేకంగా విద్యావంతులైన చాలా మంది ఇరానియన్ మహిళల నుంచి నేరుగా సందేశాలు నాకు వస్తున్నాయి” అని అలినేజాద్ అన్నారు.ఆమె వీడియోలు చూసిన చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube