విజయ్ దేవరకొండ తన తల్లితో కలిసి నటించిన ఈ సినిమా గురించి తెలుసా?

సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు.ఈయన నువ్విలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Vijay Devarakonda Act With His Mother In Dear Comrade Movie, Dear Comrade, Vijay-TeluguStop.com

ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  హీరోగా మొదటి పలు సినిమాలతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈయన కెరియర్లో హిట్టు ఫ్లాపులు ఉన్నప్పటికీ విపరీతమైనటువంటి అభిమానులను సొంతం చేసుకున్నారు.

Telugu Dear Comrade, Madhavi, Rashmika-Movie

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇలాంటి తరుణంలోనే ఈయనకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ( Anand Devarakonda ) ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ఎప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించిన సందర్భాలు లేవు కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన తల్లితో కలిసి ఒక సినిమాలో కనిపించారు.

బహుశా ఈ విషయాన్ని చాలామంది గుర్తించకపోవచ్చు.

Telugu Dear Comrade, Madhavi, Rashmika-Movie

విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ ( Madhavi Devarakonda )తో కలిసి ఒక సినిమాలో నటించారు.ఆ సినిమాలో ఈమె కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించారు.అయితే ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో పెద్దగా ఎవరు గుర్తించకపోవచ్చు.

మరి వీరిద్దరూ కలిసి నటించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికొస్తే ఆ సినిమా మరి ఏదో కాదు విజయ్ దేవరకొండ రష్మిక ( Rashmika )హీరో హీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్( Dear Comrade ) .ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి నటించారని విషయం తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.అయితే ఈ సినిమా ఊహించని విధంగా సక్సెస్ అందుకోలేకపోయిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube