రాజాసాబ్ మూవీ గ్లింప్స్ రివ్యూ.. గ్లింప్స్ లో ప్రభాస్ కిర్రాక్ లుక్స్ కు వావ్ అనాల్సిందే!

ప్రభాస్, మారుతి( Prabhas, Maruti ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్( Rajasab ) సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.చాలా కాలం నుంచి ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలవుతుందని భావించిన ఫ్యాన్స్ కు మేకర్స్ మాత్రం ఒకింత షాకిచ్చారు.

 Prabhas Rajasaab Movie Glimpse Review Details Inside Geos Viral In Social Media-TeluguStop.com

ఈ సినిమా 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది.

మరోవైపు రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్స్ పరంగా అదరగొట్టారు.

గ్లింప్స్ లో ప్రభాస్ కిర్రాక్ లుక్స్ కు వావ్ అనాల్సిందే అంటూ నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్రభాస్ మాత్రం లుక్స్ తో అభిమానులను మెస్మరైజ్ చేశారు.

గ్లింప్స్ లో కంటెంట్ పెద్దగా లేకపోయినా సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా స్టోరీ లైన్ ను రివీల్ చేయడానికి ఇష్టపడలేదు.

ఈ సినిమా పూర్తి టైటిల్ ది రాజాసాబ్( The Rajasab ) అయినా ప్రేక్షకులు మాత్రం రాజాసాబ్ అనే ఫిక్స్ అయ్యారు.థమన్( Thaman ) ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా గ్లింప్స్ కు అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది.తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాలో కామెడీకి సైతం ఎక్కువగానే ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం అందుతోంది.

సలార్, కల్కి( Salar, Kalki ) సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను రిపేర్ చేసిన ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో సైతం అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.ది రాజాసాబ్ మూవీ బిజినెస్ పరంగా కూడా అదరగొట్టిందని ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ది రాజాసాబ్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా ఒక థియేటర్ చుట్టూ ఈ సినిమా నడుస్తుందని వార్తలు వినిపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube