ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ .. ఏం జరుగుతోంది ?

తెలంగాణలో రెండుసార్లు వరుసగా అధికారంలోకి మూడోసారి హ్యాట్రిక్ సాధ్యం అని వేసిన అంచనా తప్పడం తో  బీఆర్ఎస్( BRS ) పరిస్థితి ఇప్పుడు అల్లకల్లోలం  గానే ఉంది.ఊహించని విధంగా కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసుకోవడం అలాగే ఆపరేషన్ ఆకర్స్ పేరుతో పేద ఎత్తున కీలక నాయకులు , ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటూ ఉండడం ఇవన్నీ బీఆర్ఎస్ లో ఆందోళన పెంచుతున్నాయి.

 Kcr Meeting With Brs Key Leaders In Erravalli Farm House Details, Kcr, Ktr, Tela-TeluguStop.com
Telugu Brs Key, Erravalli Farm, Harish Rao, Kcr, Mlc Kavitha, Akarsh, Telangana-

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారు , తనకు అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన వారు సైతం పార్టీ అధికారంలో లేకపోవడంతో కేసులకు భయపడే కాంగ్రెస్ ఇచ్చే పదవులపై ఆశతో పార్టీ మారిపోతున్నారు.  ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఇంకా ఈ చేరికల పరంపర కొనసాగుతూనే ఉండడం,  మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) వ్యవహారంలో తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) జైలుకు వెళ్లడం తదితర పరిణామాలు అన్నిటిని లెక్కలు వేసుకుంటున్న కెసిఆర్( KCR ) ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  దీనిలో భాగంగానే భయాందోళనలో ఉన్న పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Telugu Brs Key, Erravalli Farm, Harish Rao, Kcr, Mlc Kavitha, Akarsh, Telangana-

తాజాగా పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో( Erravalli Farm House ) కేసీఆర్ సమావేశం అయ్యారు.ఈ మేరకు హరీష్ రావు( Harish Rao ) నేతలను ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లినట్టు సమాచారం.ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు,  కీలక నాయకులు పార్టీ మారుతూ ఉండడం , కాంగ్రెస్ ఇస్తున్న ఆఫర్లు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.గత వారం రోజులుగా హరీష్ రావు,  కేటీఆర్ లు ఢిల్లీకి వెళ్లారు.

నిన్ననే రాష్ట్రానికి తిరిగి వచ్చారు.  ఈ సందర్భంగా కెసిఆర్ తో బేటి అయ్యారు.

హరీష్ రావు,  కేటీఆర్ , కెసిఆర్ భేటీ నిన్న జరగగా , ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కావడం రాజకీయంగా  చర్చనీయాంసంగా మారింది.త్వరలోనే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా వస్తున్న వార్తలతో కేసిఆర్ అలర్ట్ అయినట్టుగానే కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube