ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారా?

తెలుగు సినీ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్టీఆర్ చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Why Is Ntr Taking A Step Back, Ntr, Step Back, Director, Tollywood ,shaurya, Tar-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అంతేకాకుండా ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.

ప్రస్తుతం కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 90 శాతం పూర్తి అయినట్టు తెలుస్తోంది.

త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు తారక్.ఇకపోతే తారక్ కి ఫ్లాప్స్ లో ఉన్న దర్శకులకు కేవలం వారి ప్రతిభను నమ్మి అవకాశమిచ్చి వారితో హిట్స్ కొట్టే హీరోగా పేరుంది.

అంతేకాదు, ప్రతిభావంతులైన యువ దర్శకులను గుర్తించడంలోనూ, వారిని ఎంకరేజ్ చేయడంలో కూడా ఎన్టీఆర్ ముందుంటాడు.కానీ ఎందుకనో వారితో సినిమాలు తీయడానికి మాత్రం వెనకాడుతుంటాడు.స్వామిరారా అనే క్రైమ్ కామెడీ మూవీతో సుధీర్ వర్మ( Sudheer Verma ) డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన ఈ మూవీ 2013 లో విడుదలై సర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది.

స్టార్స్ లేకుండా తక్కువ బడ్జెట్ తో చేసిన ఈ మూవీతో సుధీర్ వర్మ ఇంప్రెస్ చేశాడు.అతని ప్రతిభకి ఎన్టీఆర్ కూడా ఫిదా అయ్యాడు.

అంతేకాదు ఆ సమయంలో ఎన్టీఆర్ కి సుధీర్ ఒక కథని వినిపించాడు.వీరి కాంబినేషన్ లో సినిమా రానుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

Telugu Step, Tollywood, Ntr Step-Movie

కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.ఆ తర్వాత 2016 లో వచ్చిన పెళ్ళి చూపులు మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికి తెలిసిందే.విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్( Tarun Bhaskar )ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది? కీడా కోలా వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు.అయితే మధ్యలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి తరుణ్ ప్రయత్నించాడు.వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి.

ఈ కాంబోలో మూవీ ఉంటుందని ఆ టైంలో న్యూస్ గట్టిగానే వినిపించింది.కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఎందుకనో పట్టాలెక్కలేదు.

ఇక ఇప్పుడు మరో యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.నాని హీరోగా నటించిన హాయ్ నాన్న మూవీతో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే మెప్పించాడు శౌర్యవ్.

Telugu Step, Tollywood, Ntr Step-Movie

ఈ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాకే ఏకంగా ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని రీసెంట్ గా ప్రచారం జరిగింది.అయితే ఆ ప్రచారంలో కొంతే వాస్తవం ఉందనేది సన్నిహితవర్గాల మాట. శౌర్యవ్( Shauryav ) ఇటీవల ఎన్టీఆర్ ని కలిసి కథ చెప్పిన మాట నిజమేనని అంటున్నారు.అయితే శౌర్యవ్ టాలెంట్ కి, అతను చెప్పిన స్టోరీకి ఎన్టీఆర్ ఇంప్రెస్ అయినప్పటికీ సినిమా చేయడానికి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

దీంతో సుధీర్ వర్మ, తరుణ్ భాస్కర్ ల సినిమాల తరహాలోనే ఇది కూడా ప్రచారానికే పరిమితవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అంతేకాకుండా ఈ విషయంలో ఎన్టీఆర్ కూడా బయపడుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube