ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ .. ఏం జరుగుతోంది ?

తెలంగాణలో రెండుసార్లు వరుసగా అధికారంలోకి మూడోసారి హ్యాట్రిక్ సాధ్యం అని వేసిన అంచనా తప్పడం తో  బీఆర్ఎస్( BRS ) పరిస్థితి ఇప్పుడు అల్లకల్లోలం  గానే ఉంది.

ఊహించని విధంగా కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసుకోవడం అలాగే ఆపరేషన్ ఆకర్స్ పేరుతో పేద ఎత్తున కీలక నాయకులు , ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటూ ఉండడం ఇవన్నీ బీఆర్ఎస్ లో ఆందోళన పెంచుతున్నాయి.

"""/" / గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారు , తనకు అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన వారు సైతం పార్టీ అధికారంలో లేకపోవడంతో కేసులకు భయపడే కాంగ్రెస్ ఇచ్చే పదవులపై ఆశతో పార్టీ మారిపోతున్నారు.

  ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఇంకా ఈ చేరికల పరంపర కొనసాగుతూనే ఉండడం,  మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) వ్యవహారంలో తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) జైలుకు వెళ్లడం తదితర పరిణామాలు అన్నిటిని లెక్కలు వేసుకుంటున్న కెసిఆర్( KCR ) ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

  దీనిలో భాగంగానే భయాందోళనలో ఉన్న పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

"""/" / తాజాగా పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో( Erravalli Farm House ) కేసీఆర్ సమావేశం అయ్యారు.

ఈ మేరకు హరీష్ రావు( Harish Rao ) నేతలను ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లినట్టు సమాచారం.

ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు,  కీలక నాయకులు పార్టీ మారుతూ ఉండడం , కాంగ్రెస్ ఇస్తున్న ఆఫర్లు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

గత వారం రోజులుగా హరీష్ రావు,  కేటీఆర్ లు ఢిల్లీకి వెళ్లారు.నిన్ననే రాష్ట్రానికి తిరిగి వచ్చారు.

  ఈ సందర్భంగా కెసిఆర్ తో బేటి అయ్యారు.హరీష్ రావు,  కేటీఆర్ , కెసిఆర్ భేటీ నిన్న జరగగా , ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కావడం రాజకీయంగా  చర్చనీయాంసంగా మారింది.

త్వరలోనే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా వస్తున్న వార్తలతో కేసిఆర్ అలర్ట్ అయినట్టుగానే కనిపిస్తున్నారు.

కొలెస్ట్రాల్ ను తగ్గించే లెమన్ గ్రాస్.. ఇంతకీ ఎలా తీసుకోవాలి..?