బీజేపీ చేరాలంటే ఇన్ని కండిషన్లా ?  అందుకేనా కాంగ్రెస్ లోకి క్యూ ? 

వచ్చే ఎన్నికల్లో నైనా  తెలంగాణలో అధికారం సాధించాలని పట్టుదలతో ఉన్న బిజెపి( BJP ) అందుకు తగ్గట్లుగా మాత్రం నిర్ణయాలు తీసుకోలేకపోతోంది.  పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి,  రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించేలా బలమైన నేతలను పార్టీలోకి తీసుకునే విషయంలో బిజెపి చేస్తున్న తప్పిదాలు కాంగ్రెస్కు వరంగా మారాయి.

 So Many Conditions To Join Bjp Thats Why The Queue Into The Congress Details, Bj-TeluguStop.com

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెంది కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చింది.ఇక పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.

  దీంతో బీఆర్ఎస్( BRS ) నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులు ఆ పార్టీలోనే కొనసాగితే  రాజకీయ భవిష్యత్తు వెనుకబడిపోతుందనే ఉద్దేశంతో పార్టీ మారాలని చూస్తున్నారు.

Telugu Kishan, Brs Mlas, Brsmlas, Congress, Revanth Reddy, Telangana Bjp, Telang

ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,  ఇతర కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరిపోయారు.కానీ బిజెపిలో మాత్రం చేరికలు కనిపించడం లేదు.బీఆర్ఎస్ కు  రాజీనామా చేసిన చాలామంది బిజెపిలో చేరాలని ప్రయత్నించినా,  అక్కడ చేరేందుకు విధించిన నిబంధనలు చూసి భయపడి కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

ఆపరేషన్ ఆకర్ష్( Operation Akarsh ) పేరుతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,  నాయకులను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంటుంది.ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోగా,  మరి కొంత మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

బిఆర్ఎస్ నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా.బిజెపి పెడుతున్న కండిషన్స్ చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారట.

Telugu Kishan, Brs Mlas, Brsmlas, Congress, Revanth Reddy, Telangana Bjp, Telang

బీఆర్ఎస్ నుంచి పార్టీ మారాలనుకున్న వారికి కాంగ్రెస్ పెద్దపేట వేస్తుండగా , బిజెపి మాత్రం చేర్చుకునేందుకు సవాలక్ష నిబంధనలు విధించి ఆ కండిషన్స్ కు ఒప్పుకుంటేనే పార్టీలో చేరాల్సిందిగా సూచిస్తుండడంతో,  చేరాలనుకున్నవారు వెనక్కి తగ్గిపోతున్నారట.  ముఖ్యంగా బీజేపీల చేరాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాలని బిజెపి విధిస్తున్న కండిషన్  చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిజెపిలోకి కాకుండా కాంగ్రెస్ వైపే ఎక్కువ మొక్కు చూపించడానికి కారణమట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube