వివాదాస్పద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రవీణ్ ప్రకాశ్ స్వచ్చంద పదవీ విరమణ చేయగా ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది.
సర్వీస్ నుంచి ప్రవీణ్ ప్రకాష్ తొలగింపునకు అంగీకారం లభించింది.ప్రవీణ్ ప్రకాష్ 1994 బ్యాచ్ కు చెందిన అధికారి కాగా ఆయన నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
జూన్ నెల 25వ తేదీన ప్రవీణ్ ప్రకాష్( Praveen Prakash VRS ) వీ.ఆర్.ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది.త్వరలో ప్రవీణ్ ప్రకాష్ సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టనున్నారని బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారని సమాచారం అందుతోంది.
కూటమి సర్కార్ ప్రవీణ్ ప్రకాశ్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భోగట్టా.
ప్రవీణ్ ప్రకాశ్ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా ఆయన బీజేపీ( BJP )లో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రవీణ్ ప్రకాశ్ భార్య భావన ఐపీఎస్ అధికారి అనే సంగతి తెలిసిందే.ప్రవీణ్ ప్రకాశ్ విద్యాశాఖలో కీలక హోదాలో పని చేయగా ఉపాధ్యాయులను వేధించారనే అపవాదు ఆయనపై ఉంది.
కొంతమంది ఐఏఎస్ అధికారులు సైతం గతంలో ప్రవీణ్ ప్రకాశ్ పై విమర్శలు చేశారు.ఏడాదిన్నర క్రితమే ప్రవీణ్ ప్రకాశ్ వీ.ఆర్.ఎస్ తీసుకోవాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆయన ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గారని సమాచారం అందుతోంది.ప్రవీణ్ ప్రకాశ్ నిర్ణయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.గతంలో ప్రవీణ్ ప్రకాశ్ కేంద్ర సర్వీస్ లోకి వెళ్లాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.
పొలిటికల్ ప్రచారం గురించి ప్రవీణ్ ప్రకాశ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.ప్రవీణ్ ప్రకాశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.