ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల ఫలితాలు ఒకింత సంచలన ఫలితాలు అనే చెప్పాలి.రాష్ట్రంలో కూటమి విజయాన్ని చాలామంది ఊహించినా వైసీపీ 11 సీట్లకే పరిమితం అవుతుందని ఎవరూ భావించలేదు.
అయితే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ జగన్ కు, కేతిరెడ్డికి అనుకూలంగా ఢిల్లీలో తాజాగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ కావడం గమనార్హం.
అయితే కేటీఆర్(KTR ) చేసిన కామెంట్ల గురించి ఏపీ అధికార పార్టీ నేతల నుంచి కౌంటర్లు వస్తున్నాయి.ఏపీ మంత్రి సత్యకుమార్( Satyakumar ) కేటీఆర్ చేసిన కామెంట్స్ గురించి స్పందిస్తూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓటమి గురించి చిలక పలుకులు పలుకుతున్నారని కామెంట్లు చేశారు.ధరణి పేరుతో తెలంగాణలో భూ మాఫియా నడిపారని ఆయన చెప్పుకొచ్చారు.
ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో కేతిరెడ్డి( Kethireddy Venkatarami Reddy ) ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేట్, ప్రజల అస్తులను సైతం ఆక్రమంచాడని చివరకు చెరువులు, కొండలను కూడా కబళించాడని గుడ్ మార్నింగ్ అంటే కబ్జా కలెక్షన్ కరప్షన్ కమీషన్లే గుర్తుకు వస్తాయని సత్యకుమార్ వెల్లడించారు.ఫామ్ హౌస్ కు పరిమితమైన కేటీఆర్ ట్విట్టర్ లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారని ఏపీ మంత్రి వెల్లడించారు.అవినీతిని ప్రశ్నించినందుకు కేటీఆర్ నాలుగేళ్ల క్రితం ట్విట్టర్ లో బ్లాక్ చేశారని సత్యప్రసాద్ పేర్కొన్నారు.మిమ్మల్ని, మీ ప్రియ మిత్రులైన జగన్, కేతిరెడ్డిలను అవినీతి, అసమర్థత, అహంకారం ఓడించాయని ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చి ఓదార్చుకోండని ఆయన వెల్లడించారు.
సత్యప్రసాద్ ట్విట్టర్ ద్వారా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.సత్యప్రసాద్ చేసిన కామెంట్ల గురించి మాజీ మంత్రి కేటీఆర్ నుంచి జవాబు వస్తుందేమో చూడాల్సి ఉంది.