తృటిలో తప్పించుకున్నాను.. నా జీవితం సావిత్రి గారిలా అయ్యేది: సమంత

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సమంత( Samantha ) .ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు అనంతరం తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

 Samantha Sensational Comments About Her Love And Divorce With Nagachaitanya ,sa-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే సమంత నటుడు అక్కినేని నాగచైతన్యను(Nagachaitanya ) ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ప్రేమ వివాహం చేసుకున్న ఈమె మూడు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

అనంతరం ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే విడాకులు ( Divorce ) తీసుకొని విడిపోయారు.

Telugu Bollywood, Citadel, Divorce, Nagachaitanya, Samantha, Savitri, Tollywood-

ఇలా విడాకులు తీసుకున్న సమంత తన కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు అయితే వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి ఈమె మయోసైటిసిస్ వ్యాధికి గురి అయ్యారు.ఈ వ్యాధి కారణంగా కొంతకాలం పాటు సినిమాలకు దూరమైన తిరిగి తన కెరియర్లో బిజీ అవుతున్నారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన ప్రేమ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను కూడా ప్రేమలో మోసపోయానని తెలిపారు.

Telugu Bollywood, Citadel, Divorce, Nagachaitanya, Samantha, Savitri, Tollywood-

ఇలా ప్రేమలో మోసపోయినప్పటికీ తృటిలో తాను తప్పించుకున్నానని లేకపోతే నా జీవితం కూడా మహానటి సావిత్రి( Savitri )గారిలాగే అయ్యేది అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.మహానటి సావిత్రి గారి జీవితం గురించి నాకు తెలియదు కానీ మహానటి సినిమాలో చేసే సమయంలో మాత్రం ఆమె గురించి పూర్తి తెలుసుకున్నానని తెలిపారు.ఇలా నేను కనుక తనని వదిలివేయకపోతే నా జీవితం కూడా సావిత్రి గారిలాగే తయారయ్యేది అంటూ సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక మహానటి సినిమాలో జెమినీ గణేషన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఆమె చాలా మానసిక క్షోభకు గురి అవుతూ దురాలవాట్లకు బానిస అయ్యారు.అలా తన జీవితం కాకుండా బయటపడ్డానంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube