ప్రస్తుతం సినిమా సత్తా ఏంటో ట్రైలర్ తోనే తేల్చి చెప్తున్నారు నెటిజన్లు.అన్నం ఉడికిందా? లేదా? అని చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్లు.సినిమా హిట్టో? ఫట్టో? చెప్పాలంటే ట్రైలర్ చాలు అంటున్నారు సోషల్ మీడియాలో జనాలు.ఏమాత్రం బాగా లేకపోయినా డిస్ లైక్ బటన్ నొక్కి తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత కొంత కాలంగా కొన్ని సినిమాల ట్రైలర్స్ తో పాటు పలు వీడియో సాంగ్స్ భారీగా దక్కించుకుంటూ చెత్త ట్రైలర్స్ పేరు సంపాదించుకున్నాయి.ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సడక్-2 ట్రైలర్

తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ అయిన సడక్-2 ట్రైలర్ భారీగా డిస్ లైక్స్ సాధించి విమర్శల పాలైంది.సింగిల్ డిజిట్ ను దాటి డబుల్ డిజిట్స్ లో డిస్ లైక్స్ అందుకుంది.ఓవరాల్ గా 11 మిలియన్ల డిస్ లైక్స్ పొందింది.మోస్ట్ డిస్ లైక్ వీడియో ఆన్ యూట్యూబ్ గా రికార్డు సాధించింది.
మిస్టర్ ఫైసుస్ ఎక్స్ ఫ్లోరింగ్ షిల్లాంగ్

షిల్లాంగ్ కు సంబంధించిన యాత్రా విశేషాలను చెప్పడంతో పాటు అక్కడ సినిమా షూటింగ్ జరిగే విషయాన్ని వెళ్లడిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసాడు వ్లాగర్.అయితే జనాలను అంతగా ఆకట్టుకొని ఈ వీడియో 3.6 మిలియన్ల డిస్ లైక్స్ పొందింది.
ఆజా బేటా క్యారీ టేకో రాస్తా సికాయే
ఈ వీడియో సైతం భారీగా డిస్ లైక్స్ సాధించింది.సుమారు 2.4 మిలియన్ల డిస్ లైక్స్ సంపాదించిన వీడియోగా పేరు తెచ్చుకున్నది.
అమీర్ సిద్దికి రిప్లై టు క్యారీ

ఫిల్మ్ అనలిస్ట్ అమీర్ సిద్ధికి తాజా గా క్యారీకి ఇచ్చిన రీప్లై జనాలకు పెద్దగా నచ్చలేదు.దీంతో ఆయన వీడియోకి పెద్ద సంఖ్యలో డిస్ లైక్స్ ఇచ్చారు.సుమారు మిలియన్ డిస్ లైక్స్ పొందింది ఈ వీడియో.
ప్రియా వారియర్ ట్రైలర్

కన్నుకొట్టి ఓవర్ నైట్ స్టార్ గా మారిన నటి ప్రియా వారియర్.తను నటించిన ఓరు ఆధార్ లవ్ వీడియో సైతం భారీగా డిస్ లైక్స్ పొందింది.ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ వీడియో అయినా జనాలు అంతగా ఆదరించలేదు.
ఆన్క్ మేరీ ఫీట్

రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్ నటించిన ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ చాలా వరకు వేలకొద్ది డిస్ లైక్స్ పొందాయి.ఒక సినిమాలోని దాదాపు సగం వీడియోలకు ఇలా జనాదరణ లేకపోవడం విశేషం.వీటిలో పాటు మరికొన్ని వీడియోలు సైతం భారీగా డిస్ లైక్స్ పొందాయి.