బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్( Rakhi sawant ) గురించి మనందరికి తెలిసిందే.ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకుంది.
ఎక్కువగా పిచ్చి పిచ్చి డ్రెస్ లు వేసుకుంటూ వస్త్రధారణ విషయంలో ఉర్ఫి జావెద్ కీ పోటీగా నిలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కీ గురవుతూ ఉంటుంది.ఈమె సోషల్ మీడియా ద్వారానే కాకుండా కాంట్రవర్సీల ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు.
అయితే అప్పట్లో స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన ఆమె తన అందం, అభినయంతో బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

అయితే కొన్నాళ్ల తర్వాత అవకాశాలు తగ్గడంతో రాఖీ పేరు అంతా మర్చిపోయారు.దీంతో కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉండి హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షోతో( Hindi Bigg Boss reality show) మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.బిగ్‌బాస్ హౌస్‌లో రాఖీ చేసిన సందడి, కామెంట్స్ సోషల్ మీడియాలో( Social media ) బాగా వైరల్ అయింది.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో రాఖీ సావంత్ బాగా సైలెంట్ అయిపోయింది.అయితే అందుకు గల కారణం ఆమె అనారోగ్య బారిన పడడమే.ప్రస్తుతం ఈ బ్యూటీ దుబాయ్ లో ఉంటూ చికిత్స పొందుతోంది.ఆ మధ్య శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ బ్యూటీ తన ఆరోగ్య విషయాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది.నాకు శస్త్ర చికిత్స జరిగిన విషయం వాస్తవమే.ఒకసారి వైద్యులు చెక్ చేసి గుండె పోటు లక్షణాలు ఉన్నాయని చెప్పారు.వైద్య పరిక్షల అనంతరం నా గర్భాశయంలో 10 సెంటీ మీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే సర్జరీ చేయించుకోవాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు.దీంతో నేను సర్జరీ చేయించుకున్నాను.
కణితితో పాటు గర్భాశయాన్ని కూడా తొలగించారు.ఇక నేను తల్లిని కాలేనని వైద్యులు చెప్పడంతో ఏడ్చేశాను.
నేను తల్లి అవ్వాలంటే సరోగసీ ద్వారా పిల్లలను పొందాల్సిందే అని రాఖీ సావంత్ ఎమోషనల్ అయింది.ఇక ఆస్పత్రిలో ఉన్నప్పుడు హీరో సల్మాన్ ఖాన్ ( Salman khan )అండగా నిలిచాడని, తన మెడికల్ బిల్లులు మొత్తం ఆయనే కట్టేశాడని తెలిపింది రాఖీ సావంత్.