వైరల్ వీడియో: ఎలిగేటర్ వద్ద ఫోటోలకు ఫోజులు.. చివరకు.?

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.దీంతో ప్రపంచనా ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికీ ఇట్లే తెలిసిపోతుంది.

 Parents, Make Their Children Pose, Next To Alligator ,for A Pic ,us Internet ,l-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం చాలా మంది అనేక ప్రయత్నాలు, సాహసాలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా తల్లిదండ్రులు పిల్లలకు రక్షణ కల్పించవలసిన వాళ్లే.

ప్రాణాలను రిస్కులో పెడుతున్నారా అన్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఓ మొసలి అదేనండి.

ఎలిగేటర్.ఇది ఒక భయంకరమైన మొసలి( crocodile ).అలాంటి భయంకరమైన మొసలితో కలిసి పిల్లలతో ఫోటోలకు ఫోజులు ఇవ్వమని సలహా ఇసున్న తల్లిదండ్రులలు చూసి చాలామంది నెటిజన్స్ ఆగ్రహాన్ని గురి చేస్తున్నారు.ఇక ఈ సంఘటన ఫ్లోరిడాలోని ఎవర్‌ గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో ( Everglades National Park, Florida )చోటు చేసుకుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.తమ ఇద్దరు పిల్లలను ముసలి దగ్గరగా నిలబడి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని కోరాడు.ఆ చిన్నారులు ముసలి పక్కనే నిలబడేందుకు చాలా భయంతో ఆలోచిస్తూ ఉన్నప్పటికీ పెద్దవారు ఆ విషయం పట్టించుకోకుండా ఫొటోస్ తీయడం మనం చూడవద్దు.ఈ క్రమంలో ఎలిగేటర్ ( Alligator )రోడ్డు పక్కన నోరు తెరవడం కూడా మనం చూడవచ్చు.

అయినా కానీ వారు ఎవరూ దాన్ని పట్టించుకోకుండా ఫోటోలు దిగడం చూడవచ్చు.అంతేకాకుండా మరో యువతి కూడా అక్కడే ఫోటోలకు ఫోజూలు ఇవ్వడం.అలాగే ఆమెతో పాటు మరో చిన్న పిల్లవాడిని కూడా ఫొటోస్ కోసం పిలవడం మనం చూడవచ్చు.

అయితే ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఇలా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రిస్క్ లో పెడుతున్నారా అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.మరొక వైపు పిల్లలను ఎలిగేటర్‌తో ఇలా ఆటలాడించడం తల్లిదండ్రులదే తప్పని యూజర్ కామెంట్ చేసారు.మరికొందరేమో.

ఎలిగేటర్లు నీటిలో, భూమిపై ఎంత వేగంగా ఉంటాయో ప్రజలు అర్థం చేసుకోలేరని కామెంట్ చేశాడు.ఇక వైల్డ్ ఫ్లోరిడా ప్రకారం.

ఎలిగేటర్లు తక్కువ దూరాలలో వేగంగా దూసుకుపోగలవు.భూమిపై గంటకు 35 మైళ్ల వరకు కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయిట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube