కెనడా : రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయులు వీరే , ఇండియన్ కాన్సులేట్ సంతాపం

సోమవారం కెనడాలోని అంటారియోలో( Ontario ) వాహనాలు ఢీకొన్న ఘటనలో మరణించిన భారతీయులను అక్కడి పోలీస్ శాఖ గుర్తించింది.వీరిని మణివణ్ణన్, ( Manivannan ) అతని భార్య మహాలక్ష్మీగా( Mahalakshmi ) తెలిపారు.

 Indian Nationals Identified In Tragic Canada Collision Details, Indian Nationals-TeluguStop.com

ఈ దుర్ఘటనలో చనిపోయిన నలుగురిలో ఈ భార్యాభర్తలతో పాటు వారి మూడు నెలల మనవడు కూడా వున్నారు.ఈ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ సిద్ధార్థ్ నాథ్( Consul General Siddhartha Nath ) బాధితుల పేర్లను పేర్కొంటూ.

‘‘ హైవే 401పై జరిగిన ఘోర ప్రమాదంలో భారతీయ పౌరులైన మణివణ్ణన్, అతని భార్య మహాలక్ష్మీ, వారి మనవడు ప్రాణాలు కోల్పోయారని.వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ’’ అని ట్వీట్ చేశారు.

ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని కలిసిన సిద్ధార్థ్ నాథ్.వారికి అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

కెనడిన్ అధికారులతో తాము టచ్‌లో వున్నట్లు ట్వీట్‌లో తెలిపారు.

Telugu Consulgeneral, Durham Regional, Highway, Mahalakshmi, Manivannan, Ontario

విట్బీ పట్టణంలో పోలీసుల ఛేజింగ్ కారణంగా .పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఏప్రిల్ 29న రాత్రి 7.50 గంటలకు డర్హామ్ రీజినల్ పోలీస్ సర్వీస్‌కు.( Durham Regional Police Service ) మద్యం దుకాణంలో దోపిడీ జరిగినట్లుగా సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ కార్గో వ్యాన్‌ని గుర్తించి డర్హామ్‌లోని పలు వీధుల గుండా ఆ వ్యాన్‌ని ఫాలో చేశారు.ఈ క్రమంలో హైవేలోకి ప్రవేశించిన వ్యాన్.

రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లింది.ఈ కారణంగా ఆరు వాహనాలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది.

ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.మరణించిన చిన్నారి తల్లిదండ్రులు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Telugu Consulgeneral, Durham Regional, Highway, Mahalakshmi, Manivannan, Ontario

ప్రమాదంలో మరణించిన మరో వ్యక్తిని వ్యాన్ డ్రైవర్‌గా గుర్తించారు.ఏడుగురు పరిశోధకులు, ఒక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ , ఒక సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిపుణుడు ఈ కేసును దర్యాప్తును చేస్తున్నట్లుగా ఎస్ఐయూ తెలిపింది.ఈ ఘటనలో పోలీస్ వాహనాల ప్రమేయం వుండటంతో ఎస్ఐయూ రంగంలోకి దిగింది.వ్యక్తుల మరణాలు, తీవ్రమైన గాయాలు, లైంగిక వేధింపులు, తుపాకీని ఉపయోగించాల్సి వచ్చిన సందర్భాలను విచారించే అధికారిక ఏజెన్సీయే ఎస్ఐయూ.

డర్హామ్ పోలీస్ వాహనాలు కూడా ట్రాఫిక్ ప్రవాహానికి వ్యతిరేక దిశలో హైవేలోకి ప్రవేశించినట్లుగా స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.‘‘ ఎవరో గాయపడబోతున్నారు ’’ అని ఒక పోలీస్ రేడియో రికార్డింగ్‌లో ఓ అధికారి చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube