1.లిక్కర్ స్కాం లో కవితకు ఊరట
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది.ఈ కేసును నవంబర్ 20 వాయిదా వేసింది.
2.ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు
హిందువులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.
3.చంద్రబాబు బెల్ కస్టడీ పిటిషన్ పై విచారణ
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది.
4.మంత్రి హరీష్ రావు కామెంట్స్
నీతి అయోగ్ హెల్త్ ఇండెక్స్ లో మొదటి మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
5.కిషన్ రెడ్డి పర్యటన
నేడు హైదరాబాదులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు .ఉదయం కిసాన్ రోజ్ గార్ మేళాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
6.చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి కామెంట్
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ పై కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక సహాయ మంత్రి నారాయణస్వామి( Narayanaswamy ) స్పందించారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఆరోజు చంద్రబాబు పేరు లేదని తాను విన్నానని, ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఆయన పేరు వచ్చిందని మళ్లీ కేసు ఓపెన్ చేశారని నారాయణస్వామి అన్నారు.
7.పరిటాల సునీత దీక్ష భగ్నంపై అచ్చెన్న కామెంట్స్
చంద్రబాబు కోసం మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు స్పందించారు .శాంతియుత నిరసనలను అడ్డుకోవడం ,మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం అరాచక పాలనకు నిదర్శనమని అచ్చెన్న మండిపడ్డారు.
8.నారా లోకేష్ పై సిఐడి కేసు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ను పద్నాలుగో నిందితుడిగా చేరుస్తూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది.
9.ఆలేరు ఎమ్మెల్యేకు తెలంగాణ హైకోర్టు జరిమానా
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పదివేల జరిమానా విధించింది.2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులను చూపకుండా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు అయింది.ఈ నేపథ్యంలోని ఆమెకు జరిమానా విధించారు.
10.లోకేష్ హెచ్చరిక
అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరి పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కిపడుతున్నారని రోడ్డు ఎక్కిన ఆంగన్వాడీలపై అంత కర్కశమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
11.చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు కొనసాగుతున్నాయి.కర్ణాటకలోని తెలుగు సంఘాలు , కమ్మ సంఘం మహిళా సంఘాలు రాయచూరు జిల్లా మాన్వి పట్టణంలో సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ చేపట్టారు.
12.టిడిపి మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల అరెస్ట్
టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిశీలనకు వెళ్తున్న ధూళిపాళ్ల ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
13.తిరుమల సమాచారం
తిరుమల( Tirumala )లో భక్తుల రద్దీ బాగా తగ్గింది.శ్రీవారి దర్శనానికి నేడు భక్తులకు నేరుగా అనుమతి లభిస్తోంది .శ్రీవారి సర్వదర్శనానికి ఒక గంట మాత్రమే సమయం పడుతుంది.
14.బెంగళూరులో 144 సెక్షన్
బెంగళూరు( Bengaluru ) బంద్కు అవకాశం లేదని సోమవారం అర్ధరాత్రి నుంచి నగర వ్యాప్తంగా 144 సెక్షన్ ను జారీ చేశామని నగర పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు.
15. రఘురామ కృష్ణంరాజు విమర్శలు
నాణ్యతలేని మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ మద్యం చావులన్నీ సీఎం జగన్ వహిస్తున్న మరణ మృదంగమేనని నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు విమర్శించారు.
16.కర్నూలు ను రాజధానిగా చేయాలి
ఏపీ రాజధానిగా విశాఖ వద్దు అమరావతి ఉండాలి లేదంటే కర్నూలు నైనా రాజధానిగా చేయాలని పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ డిమాండ్ చేశారు.
15.నేడు ఏపీకి కేంద్ర పంచాయతి అధికారులు
ఏపీ వ్యాప్తంగా గ్రామపంచాయతీలకు రావలసిన ఆర్థిక సంఘం నిధులు 860 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది అంటూ ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ నేతలు ఢిల్లీ కి వెళ్లి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర అధికారుల బృందం ఏపీకి వచ్చారు.
16.నడక మార్గాన్ని పరిశీలించనున్న వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ బృందం
తిరుమల కాలినడకన చేరుకునే అలిపిరి మార్గాన్ని వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ బృందం పరిశీలన చేయనుంది.
17.శ్రీశైలం దేవస్థానం ఈవోగా పెద్దిరాజు
శ్రీశైలం దేవస్థానం నూతన కార్య నిర్వహణ అధికారిగా డి పెద్దిరాజు బాధ్యతలు స్వీకరించారు.
18.వైభవంగా శ్రీవారి మహా రథోత్సవం
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి మహా రథోత్సవం వైభవంగా నిర్వహించారు.
19.ఏపీకి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు
ఏపీకి కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి.
20.నాలుగో విడత వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు షెడ్యూల్ విడుదల అయింది.అక్టోబర్ 1న అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.