సాధారణంగా పులులు చాలా ధైర్యంగా ఉంటాయి అవి దేన్నైనా వేటాడుతాయి.వీటికి వేటాడటం తప్ప తోక ముడుచుకుని పారిపోవడం అంటే ఏంటో తెలియదు.
ముఖ్యంగా జాగ్వర్ అనే ఒక పెద్ద పులి చాలా ధైర్యంగా ఉంటుంది.అది ఈ పాములు, మొసలి ఇంకా వేరే జంతువులు దగ్గరికి వెళ్లడానికి భయపడే అన్ని కౄర మృగాలను వేటాడుతుంది.
ఇటీవల సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.ఆ వీడియోలో జాగ్వర్, మొసలి( Jaguar, crocodile ) రెండూ ఒకదానితో ఒకటి చాలా భయంకరంగా పోరాడుకుంటున్నాయి.
ఈ వీడియో చూస్తే ఈ రెండు జంతువులు అడవిలో ఎంత కష్టపడి బ్రతుకుతున్నాయో అర్థమవుతుంది.
ఈ వీడియో మొదట్లో జాగ్వర్ ఒక పెద్ద పామును వేటాడుతున్న దృశ్యం ఉంటుంది.
జాగ్వర్ ఆ పామును పట్టుకొని దాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది.దగ్గరలో ఉన్న ఇతర జంతువులు అన్నీ జాగ్వర్ చేస్తున్న ఈ వేటను చాలా ఆసక్తిగా చూస్తున్నాయి.
కానీ అనుకోకుండా ఆ పాము( Snake ) జాగ్వర్ నోటి నుంచి తప్పించుకొని నీటిలోకి దూరుతుంది.
ఆ పామును పట్టుకోలేకపోయినా, జాగ్వర్ వెనక్కి తగ్గలేదు.దాహార్తితో నీళ్లలోకి దూకింది.అందులో ఒక పెద్ద మొసలి ఉంది.
వెంటనే రెండింటి మధ్య భయంకరమైన పోరు మొదలైంది.మొసలి తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.
కానీ, జాగ్వర్ చాలా బలంగా, ధైర్యంగా పోరాడింది! చివరికి, జాగ్వర్ మొసలిని జయించి చంపేస్తుంది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జాగ్వర్ బలం, ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఇంత భయంకరమైన పోరాటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో చూసిన చాలా మంది జాగ్వర్ ధైర్యం, వేటాడే నైపుణ్యాలను చాలా మెచ్చుకున్నారు.ఇంత పెద్ద జంతువును జాగ్వర్ ఎలా జయించింది అంటూ అందరూ నోరెళ్లబెడుతున్నారు.ఈ వీడియో కింద కామెంట్స్ లో “జాగ్యువార్లు చాలా బలంగా ఉంటాయి! వీటికన్నా బలమైన పెద్ద పిల్లులు మరొకటి ఉండవనే అనుకుంటాను.” “అన్ని పెద్ద పిల్లులు ఇలా చేయలేవు.జాగ్వర్ పులులు చాలా బలంగా ఉంటాయి.” అని మరొకరు అన్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.