అక్కినేని కొత్త కోడలు కాబోతున్న శోభిత ( Sobhita Dhulipala )పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.శోభిత మంచి నటి కాగా ఆమె నటించిన సినిమాలను యూట్యూబ్ లో, ఓటీటీలలో చూడటానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే చైతన్యతో పెళ్లి జరిగిన తర్వాత శోభిత కొన్ని విషయాల్లో మారక తప్పదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.శోభిత బోల్డ్ సినిమాలు చేయొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.
సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల డ్రెస్సింగ్ విషయంలో సైతం శోభిత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.శోభిత ఈ పనులు చేయకపోతే మాత్రం అక్కినేని అభిమానుల( Akkineni fans) మెప్పు పొందడం కష్టమేనని తెలుస్తోంది.అక్కినేని కొత్త కోడలికి అసలు సిసలైన ఛాలెంజ్ ఇదేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
శోభిత కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.అక్కినేని అమలను శోభిత ఫాలో కావాలని మరి కొందరు చెబుతున్నారు.అయితే తమ కామెంట్లను కేవలం విజ్ఞప్తులలా మాత్రమే శోభిత పరిగణనలోకి తీసుకోవాలని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
శోభిత నటిగా కెరీర్ ను కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు సైతం ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి.శోభిత సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తూ మరికొన్ని సంవత్సరాల పాటు కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చైతన్య శోభిత(Naga Chaitanya, Sobhita)ను ఒకే ఫ్రేమ్ లో చూడాలని కూడా మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.శోభిత రెమ్యునరేషన్ సైతం ఒకింత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.
హాలీవుడ్ ప్రాజెక్ట్ లలో సైతం శోభిత నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.శోభిత భవిష్యత్తులో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ లో సైతం నటించే అవకాశం ఉంది.
శోభిత తెలుగమ్మాయి కావడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.