ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి అధిక బరువు ఒక పెద్ద సమస్యగా మారిపోయిన విషయం తెలిసిందే, ఇక ఒక్కసారి బరువు పెరిగితే తర్వాత బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని.ఇక బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
జిమ్ కి వెళ్లడం యోగా చేయడం వంటి చిట్కాలు పాటించడం డైట్ పాటించడం ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
కొన్ని కొన్ని సార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు రాక నిరాశ చెందుతుంటారు.
కానీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తే బరువు తగ్గడం పెద్ద కష్టమేం కాదు అని చెబుతూ ఉంటారు కొంతమంది.వారు చెప్పినప్పుడు బరువు తగ్గడం సులభమే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత ఎందుకో ఎంతో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది.
అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు ఈజీగా తగ్గొచ్చు అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కరివేపాకు తో బరువు తగ్గితే అవకాశం ఉంది అంటే ఎవరు నమ్మరు.కానీ ఇది నిజమే… ఎప్పుడూ మనం కూరల్లో వండుకునే కరివేపాకు జ్యూస్ చేసుకుని తాగితే క్రమక్రమంగా ఎంతగానో వెయిట్ లాస్ అవుతారట.కరివేపాకులో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువు తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయట ఇలా రోజూ కరివేపాకు జ్యూస్ తీసుకోవడం కారణంగా కొన్ని కిలోల బరువు తగ్గడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కరివేపాకు పై బోర్ కొట్టినప్పుడు కొత్తిమీర పుదీనా ఆకులతో జ్యూస్ తయారు చేసుకొని తాగిన బరువు తగ్గేందుకు ఆస్కారం ఉందట.ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే ఎన్నో ట్రై చేసి ఉంటారు ఇది కూడా ఓ సారి ట్రై చేసి చూడండి.