స్టార్ హీరో రవితేజ ( Ravi Teja )బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే.రవితేజ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే మిరపకాయ్ సినిమాకు( Mirapakai ) ముందు మిరపకాయ్ సినిమా తర్వాత అని మాట్లాడుకోవాలి.
ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉండేది.రవితేజ సినిమాలు కెరీర్ తొలినాళ్లలో కూడా ఫ్లాపైనా ఆ సినిమాలు మంచి కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలే కావడం గమనార్హం.
అయితే ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలు మాత్రం ఎప్పుడు విడుదలవుతున్నాయో ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో ఫ్యాన్స్ కు సైతం అర్థం కావడం లేదు. రెమ్యునరేషన్ కోసమే రవితేజ సినిమాలు చేస్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారంటే రవితేజ పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగా అర్థమవుతుంది.
వేగంగా సినిమాలు చేయడం కంటే క్వాలిటీ సినిమాలు చేయడం రవితేజ కెరీర్ కు ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ పరంగా ఇవే తరహా పొరపాట్లు చేస్తే ఎలా అని ఎంతో అనుభవం ఉన్న హీరో రీమేక్ సినిమాలలో నటిస్తూ కెరీర్ ను ఎందుకు నాశనం చేసుకుంటున్నారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.రవితేజ సినిమాలలో కథ, కథనం, ఆయన మార్క్ కామెడీ ఉండటం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మాస్ మహారాజ్ రేంజ్ అంతకంతకూ తగ్గుతోందని చెప్పవచ్చు.
మాస్ మహారాజ్ సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గుతుండటం అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.రవితేజ వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటే మాత్రమే ఈ పరిస్థితి కొంతమేర అయినా మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.వింటేజ్ రవితేజ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా బాక్సాఫీస్ వద్ద మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఈ కామెంట్లపై రవితేజ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.