సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, పొంగల్, చపాతీ, దోస వంటి ఫుడ్స్ ను ఎక్కువ శాతం మంది తింటూ ఉంటారు.అయితే వీటి వల్ల ఎక్కువ సమయం పాటు ఎనర్జిటిక్ గా ఉండలేరు.
మహా అయితే రెండు గంటల వరకు అవి మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.ఆ తర్వాత ఆకలి మొదలవుతుంది.
ఆహార కోరికలు పెరుగుతాయి.పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.
కానీ ఇకపై వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ స్మూతీని మీ బ్రేక్ ఫాస్ట్( Breakfast ) చేర్చుకుంటే ఒంటికి వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.ఎక్కువ సమయం పాటు మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు.
అదే సమయంలో మరెన్నో ఆరోగ్య లాభాలు పొందుతారు.
స్మూతీ తయారీ కోసం ముందుగా రెండు స్పూన్ల రాగి పిండిని ఒక గ్లాసు వాటర్ లో పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో పది నానబెట్టి పొట్టు తొలగించిన బాదం గింజలు( Almonds) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలు, బాగా పండిన ఒక అరటిపండు స్లైసెస్ మరియు తయారు చేసి పెట్టుకున్న రాగి జావను వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
తద్వారా మన స్మూతీ అనేది రెడీ అవుతుంది.
ఈ రాగి బనానా స్మూతీ లో విటమిన్ ఇ, బి-కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్‌లు, తగినంత క్యాలరీలు మరియు ఉపయోగకరమైన అసంతృప్త కొవ్వులు మెండుగా ఉంటాయి.బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీ ని యాడ్ చేసుకోవడం వల్ల మీరు రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా పని చేయగలుగుతారు.నీరసం, బలహీనత వంటివి ఉంటే పరార్ అవుతాయి.
అలాగే ఈ స్మూతీ బలమైన కండరాల నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి మద్దతు ఇస్తుంది.రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
పలు దీర్ఘకాలిక జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.