టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ( Hero Prabhas )ప్రస్తుతం వరసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్.
ప్రస్తుతం డార్లింగ్ చేతిలో 4,5 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.కాగా ప్రభాస్ నటించిన గత రెండు సినిమాలు సలార్, కల్కి ( Salar, Kalki )మంచి సక్సెస్ను సాధించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నా విషయం తెలిసిందే.ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకుంది.
అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.పీరియాడికల్ వార్ డ్రామాలో ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ చిత్రంలో ప్రధాన మహిళ ఇమాన్వి ను చూడగానే తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఆమె ప్రభాస్ చిత్రంతో టాలీవుడ్( Tollywood ) అరంగేట్రం చేస్తోంది.ఇటీవల ఆమె ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ క్షణం నుంచి ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది.ఆమె క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది.
ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల పెరుగుదల ద్వారా అది స్పష్టమైంది.
ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తర్వాత తక్కువ వ్యవధిలోనే 60,000 మంది ఫాలోవర్లు ఆమె ఖాతాలో చేరారు.ఆమె పాత ఫోటోలు ఆన్లైన్ లోకి వస్తున్నాయి.ఆమె డ్యాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె డ్యాన్స్ స్కిల్స్ ఇప్పటికే హృదయాలను గెలుచుకున్నప్పటికీ, ఇప్పుడు ఆమె తెరపై ఎలా నటిస్తుంది.సినిమాలో హను రాఘవపూడి ఆమె పాత్రను ఎలా రూపొందిస్తాడనే దానిపై ఇప్పుడు నిజమైన నిరీక్షణ ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు.