నిర్మల్ జిల్లా, తానూర్ మండలం, బేల్ తరోడా గ్రామంలో ఓ బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది.తన తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన 11 ఏళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది.
దానికంటే ముందు ఆమెకు మరొక కష్టం వచ్చింది.తల్లి అంత్యక్రియలకు ఆమె వద్ద చిల్లిగవ్వ కూడా లేవు.
దాంతో మృతదేహం పక్కనే కూర్చుని భిక్షాటన చేసింది.తల్లి అంత్యక్రియలకు డబ్బు ఏర్పాటు చేసుకునే దయనీయ పరిస్థితి ఆ చిన్నారికి రావడం చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు.
సోషల్ మీడియాలో ఆ హృదయ విదారకమైన దృశ్యాలు చూపించే ఓ వీడియోలో వైరల్ గా మారింది.చిన్నారి భిక్షాటన చేస్తున్న దృశ్యాలు అందర్నీ తీవ్ర బాధకు గురి చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే, కొన్ని రోజుల క్రితం, దుర్గ( Durga ) అనే చిన్నారి తండ్రి అనారోగ్యంతో మరణించాడు.తల్లి గంగామణి ( Gangamani )తీవ్ర మనస్థాపానికి గురైంది.
కానీ కూతురు కోసం బతికి వచ్చింది.అయితే సంపాదించే వ్యక్తి చనిపోవడంతో తల్లిపై చాలా ఆర్థిక భారం పడింది.
ఈ సమస్యలను తట్టుకోలేక గంగామణి ఆత్మహత్య చేసుకుంది.తన ఏకైక ఆధారమైన తల్లిని కోల్పోయిన దుర్గ గుండె పగిలింది.
తల్లి చనిపోయిన తర్వాత దుర్గ ఒంటరిగా మిగిలిపోయింది.సాయం చేయడానికి బంధువులు లేకపోవడంతో తల్లి మృతదేహం పక్కన కూర్చుని ఎంతో దీనంగా ఏడ్చింది.
తల్లి అంత్యక్రియలు( Mother’s Funeral ) ఎలా చేయాలో, డబ్బు ఎక్కడ దొరుకుతుందో తెలియక, చుట్టుపక్కల వచ్చిన వారిని బిక్షాటన చేయడం మొదలుపెట్టింది.
36 ఏళ్ల గంగామణి తన కూతురు దుర్గతో కలిసి బేల్ తరోడా( Bale Taroda ) గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవించేది.భర్త అనారోగ్యంతో మరణించడంతో ఆమె జీవితం మరింత కష్టతరమైంది.ఈ ఇబ్బందులను తట్టుకోలేక గంగామణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలిసి స్థానికులు అయ్యో పాపం అనుకున్నారు.తల్లి మృతదేహం పక్కన కూర్చుని ఏం చేయాలో తెలియక కూర్చున్న చిన్నారిని చూసి చాలా బాధపడ్డారు.
తన తల్లి అంత్యక్రియలకు చేయడానికి డబ్బు లేక దుర్గ చాలా కష్టపడింది.ఒక చిన్న వస్త్రాన్ని నేలపై పరచి, తన తల్లి అంత్యక్రియలకు డబ్బు కోసం భిక్షాటన చేయడం మొదలుపెట్టింది.
దుర్గ గురించి తెలిసి చాలామంది ఆమెకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఈ కేసును విచారించడానికి వచ్చిన పోలీసులు కూడా దుర్గ పరిస్థితి చూసి చాలా బాధపడి సహాయం చేశారు.ఈ సంఘటన గురించి విన్న ఇతరులు కూడా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు విరాళంగా ఇచ్చారు.ఈ చిన్నారి విషాదకరమైన కథ ప్రతి ఒక్కరి మనసును తాకింది.11 ఏళ్ల చిన్నారికి ఎంత కష్టమొచ్చింది అంటూ చాలామంది కన్నీరు పెట్టుకున్నారు.