చిరంజీవి రేంజ్ అంటే ఇదీ.. ఒక్కరోజులోనే ఇంద్ర టికెట్స్ ఆ రేంజ్ లో అమ్ముడయ్యాయా?

సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

 This Is The Megastar Chiranjeevi Range Details Inside Goes Viral In Social Media-TeluguStop.com

ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కానుకగా విశ్వంభర సినిమా నుంచి టీజర్ విడుదల కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.మరోవైపు చిరంజీవి పుట్టినరోజు కానుకగా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాతో పాటు ఇంద్ర సినిమా కూడా రీ రిలీజ్ అవుతున్నాయి.

మొదట ఇంద్ర సినిమా( Indra movie ) రీ రిలీజ్ కాకపోవచ్చు అని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది.మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఇంద్ర మూవీ సంచలనాలు సృష్టిస్తోంది.

కేవలం 20 గంటల వ్యవధిలో ఇంద్ర సినిమా టికెట్లు ఏకంగా 12,000కు పైగా అమ్ముడయ్యాయని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

Telugu Rupees, Indra, Chiranjeevi, Murari-Movie

కేవలం హైదరాబాద్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఏకంగా 40 లక్షల రూపాయల( 40 lakh rupees ) కంటే ఎక్కువ మొత్తంగా ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇంద్ర మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఏషియన్ సురేష్ సంస్థ సొంతం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.కొన్ని రోజుల క్రితం రీరిలీజ్ అయిన మురారి మూవీ ఏ స్థాయిలో హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Telugu Rupees, Indra, Chiranjeevi, Murari-Movie

ఇంద్ర సినిమా మురారి సినిమాను మించిన కలెక్షన్లను సొంతం చేసుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.ఫుల్ రన్ లో ఇంద్ర కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.రికార్డ్ స్థాయిలో స్క్రీన్లలో విడుదల కానుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చిరంజీవి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube