ఒక సినిమా సక్సెస్ కావాలంటే ఆ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించాలి.అయితే తాను నటించిన ప్రతి పాత్రకు అద్భుతంగా న్యాయం చేసే నటుడు ఎవరనే ప్రశ్నకు విక్రమ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.
విక్రమ్ ( Vikram )కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా అపరిచితుడు సినిమా( Aparichitudu movie ) తర్వాత కథల ఎంపికలో చేసిన తప్పుల వల్ల విక్రమ్ నటించిన కొన్ని సినిమాలు డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్నాయి.
అయితే తంగలాన్ సినిమా( Tangalan movie ) మాత్రం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఈ భాష, ఆ భాష అనే తేడాల్లేకుండా భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.సరైన కథలను ఎంచుకుంటే మాత్రం విక్రమ్ కు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
విక్రమ్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
తంగలాన్ సినిమా సక్సెస్ తో విక్రమ్ కు హిందీ, ఓవర్సీస్ లో సైతం క్రేజ్ పెరిగింది.విక్రమ్ రాజమౌళి కాంబినేషన్ ను ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ నిజమవుతుందేమో చూడాల్సి ఉంది.మహేష్ రాజమౌళి కాంబో మూవీలో సైతం విక్రమ్ పేరు వినిపిస్తుండగా విక్రమ్ మాత్రం తాను ఆ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.
విక్రమ్ పాన్ ఇండియా మార్కెట్ కు సరిపడే స్క్రిప్ట్ లను ఎంచుకుంటే బాగుంటుంది.విక్రమ్ హీరోగా మాత్రమే కెరీర్ ను కొనసాగించాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.విక్రమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోయే రోజుల్లో మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.విక్రమ్ కు చాలా కాలం తర్వాత సక్సెస్ దక్కడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.