అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో( Amazon Rainforest ) ఎన్నో సీక్రెట్స్ దాగి ఉన్నాయి.ఇక్కడ అనేక రోగాలను నయం చేయగల ఔషధ చెట్లు ఉన్నాయని కూడా చెబుతారు.
అంతేకాదు అత్యంత ప్రాణాంతకమైన జీవులు కూడా ఇక్కడే నివసిస్తుంటాయి.ఈ అడవిలో మనుషులూ నివసిస్తుంటారు.
ఇక్కడ నివసించే త్సిమానే/సిమనేస్( Tsimanes Tribe ) తెగ ప్రజలు అద్భుతమైన ఆరోగ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.ఈ తెగ ప్రజలు జంతువులను వేటాడతారు, అడవిలో దొరికే పండ్లు, కాయలు తింటారు, వ్యవసాయం కూడా చేస్తారు.
వీరి ఆరోగ్యం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు 20 ఏళ్లుగా స్టడీ చేస్తున్నారు.వారి స్టడీలో ఆసక్తికర విషయాలు తెలిసాయి.
మార్టినా కాంచి నేట్( Martina Canchi Nate ) 84 ఏళ్ల త్సిమానే మహిళ యువకుల కంటే వేగంగా పనులు చేస్తూ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి లోను చేస్తోంది.ఆమె వద్ద చెట్లను వేరుతో సహా బయటకు లాగేంత బలం ఉంది.అరటి చెట్లను కూడా చకచకా నరికేస్తోంది.భారీ బరువులను యుక్త వయసులతో పోటీగా మోస్తోంది.ఈ వయసులో ఆమెకు ఇంత శక్తి ఉండటం చూసి చాలామంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.కానీ ఆ తెగల ప్రజలు ఇంత శక్తి ఉండడం ఈ తెగ ప్రజలకు సహజం.
శాస్త్రవేత్తలు ఈ తెగ ప్రజల్లో రక్తనాళాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయని కూడా తెలుసుకున్నారు.వీరి బ్రెయిన్స్ కూడా షాపు గానే ఉంటున్నాయి అంటే చిన్నప్పుడు ఎలా ఉంటాయో అలా గా ఉంటుందని తెలుసుకున్నారు సాధారణంగా మనలాంటి మనుషుల బ్రెయిన్ పవర్( Brain Power ) అనేది వయసుతో పాటు తగ్గిపోతుంది కానీ వీరికి జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటోంది.
త్సిమానే ప్రజలు రోజూ 16,000 నుంచి 17,000 అడుగులు వాకింగ్ చేస్తుంటారు.వీళ్లు చాలా తక్కువ సేపు కూర్చుంటారు.డైలీ ఎనిమిది గంటలకు పైగా పనిచేస్తారు.కొందరైతే రోజూ 18 కి.మీ వాకింగ్ చేస్తారు.ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తింటారు.
ఫ్రైడ్ ఫుడ్స్, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉంటారు.అందుకే వీళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.
వారి ఫుడ్స్‌లో 72% కార్బోహైడ్రేట్లు, 14% ఫ్యాట్ ఉంటుంది.ప్రోటీన్ కోసం పక్షులు, కోతులు, చేపలు వంటి జంతువులను చంపి తినేస్తుంటారు.