కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న వారిలో నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) ఒకరు.ఈయనకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఆయనతో సినిమాలు చేయడం కోసం ఎంతో మంది దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు.
ఇక అవకాశం వచ్చిన డైరెక్టర్లు రజనీకాంత్ గారు తమ సినిమా విషయంలో చెప్పిన సలహాలు వింటూ ఆ సలహాల మేరకు కథలో మార్పులు చేర్పులు చేయడం చేస్తూ ఉంటారు.కానీ ఒక డైరెక్టర్ మాత్రం ఏకంగా రజనీకాంత్ కి కండిషన్లు పెట్టారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
రజనీకాంత్ లాంటి ఒక సూపర్ స్టార్ కే కండిషన్స్ పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు.ఆయన ఎలాంటి కండిషన్స్ పెట్టారనే విషయానికి వస్తే.
సూపర్ స్టార్ రజినీకాంత్ కి కండిషన్లు పెట్టిన డైరెక్టర్ మరెవరో కాదు దర్శకుడు పా రంజిత్.( Director Pa Ranjith ) ఈ సెన్సేషనల్ డైరెక్టర్ లేటెస్ట్ మూవీ తంగలాన్.( Thangalaan ) విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలై హిట్ సొంతం చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.ప్రస్తుతం ఈయన ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇక రంజిత్ రజనీకాంత్ కాంబినేషన్లో కబాలి సినిమా( Kabali ) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మనకు తెలిసిందే.ఇండియా వైడ్ కబాలి ఫీవర్ నడిచింది.
ఆ సమయంలో కబాలి పేరిట నాణాలు విడుదలయ్యాయి.అయితే ఈ సినిమా కథ రజనీకాంత్ కు వివరించే సమయంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుందని తెలుస్తుంది.తాజాగా ఈ విషయం గురించి డైరెక్టర్ మాట్లాడుతూ.రజనీకాంత్ గారికి కథ వినిపించేటప్పుడు ఆయన చాలా ఎక్సైట్ ఫీలయ్యారని తెలిపారు.ఈ కథ విన్న తర్వాత వెంటనే చేద్దామని చెప్పారు.కానీ ఈ కథ చేయడానికి డైరెక్టర్ రంజిత్ రజనీకాంత్ కు షరతులు పెట్టారట.
సర్ ఇది నా స్క్రిప్ట్ నేను రాసుకున్న విధంగానే సినిమా చేస్తాను, అలా కాకుండా సినిమాలో మార్పులు చేయాలి అంటే అసలు కుదరదు.అందుకు మీరు ఒప్పుకుంటే సినిమా చేద్దామని కండిషన్స్ పెట్టగా, అందుకు రజనీకాంత్ ఒప్పుకున్నారని అలా వీరిద్దరి కాంబినేషన్లో కబాలి వంటి సూపర్ హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలుస్తుంది.