ప్రభాస్ ఇటీవల డైరెక్టర్ హను రాఘవపూడి ( Hanu Raghavpudi ) డైరెక్షన్లో కొత్త సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ యూట్యూబర్, కొరియోగ్రాఫర్ అయిన ఇమాన్వీ( Imanvi ) అనే అమ్మాయిని ఎంపిక చేశారు.ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఈమె ప్రభాస్(Prabhas ) తో సినిమా కమిట్ అవ్వడంతో ఒక్కసారిగా ఈమెకు ఫాలోవర్స్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయారు.అంతేకాకుండా ఈమెకు సంబంధించి ఎన్నో విషయాల గురించి అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఇలా యూట్యూబర్ గా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఇమాన్వి మొన్నటి వరకు కేవలం 5 లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే కలిగి ఉన్నారు.ఇక ప్రభాస్ తో సినిమాను ప్రకటించిన తర్వాత ఈమెకు భారీ స్థాయిలో ఫాలోవర్స్ పెరిగిపోయారు.ఇకపోతే తాజాగా ఈమె రెమ్యూనరేషన్( Remuneration ) కి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.యూట్యూబర్ గా ఇమాన్వి నెలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారు.
అయితే ఇప్పుడు ప్రభాస్ తో సినిమాకు కమిట్ కావడంతో ఈమె రెమ్యూనరేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి.
ఇలా యూట్యూబ్ ద్వారా నెలకు 5 లక్షల వరకు సంపాదిస్తున్న ఇమాన్వి ప్రభాస్ తో సినిమా కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారని తెలుస్తోంది.ఇలా ఈమెకు భారీ స్థాయిలో క్రేజ్ రావడమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా కోటి రూపాయలు అది మొదటి సినిమాకు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
దీంతో ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ లభించబోతుందని తెలుగులో కూడా ఈమె ముందు ముందు మరిన్ని ఛాన్సులు అందుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.