ప్రస్తుత సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి.అలాగే ఒక్కొక్కరకు ఒక్కొక్క టేస్ట్ లో ఉన్నట్టే, ప్రతి మెదడులో సరికొత్త ఆలోచనలు ఉంటాయన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.
వారి టెస్ట్ తగ్గట్టు వారు ఏమి కావాలన్నా కూడా అలానే వారు ఉండడం, వారికి ఆలోచనలు తగ్గట్టు అన్ని సమకూర్చు కోవడం చేస్తూ ఉంటారు.అచ్చం అలాగే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు( West Godavari District ) చెందిన ఒక యువతీ కూడా కొత్త రీతిలో పెళ్లి పత్రికను( Wedding Card ) డిజైన్ చేయించుకుంది.
పెళ్లి పత్రికలో వజ్రాలు, వైడూర్యాలు అలాంటివి ఏమీ కాకుండా.ఆ యువతీ రుచికి, అభిరుచికి వృత్తికి సరిపోయే విధంగా వారి వెడ్డింగ్ కార్డులు డిజైన్ చేయించి బంధుమిత్రులకు ఆహ్వానాలు పంపింది.
అయితే., ఈ పెళ్లి పత్రికలు అందుకున్న బంధుమిత్రులు మాత్రం ఫస్ట్ ఆ పెళ్లి పత్రికను చూసి షాక్ అయ్యారు.
కానీ., అనంతరం ఆనందానికి లోనయ్యారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన నార్కెడమిల్లి సతీష్, రాణి దంపతుల కుమార్తె ప్రత్యూష. ఈ యువతి ఉత్తిరిత టీచర్ గా( Teacher ) పని చేస్తూ ఫణీంద్ర అనే యువకుడితో పెళ్లి చేయించాలని పెద్దలు నిర్ణయించారు.అయితే వీరిద్దరి వివాహం ఆగస్టు 23న జరగబోతుంది.
ఈ క్రమంలో బంధుమిత్రులందరికీ పెళ్లికి పిలిచే పనిలో అందరికీ ఆహ్వానం అందించారు.అయితే టీచర్ గా పని చేస్తున్న ప్రత్యూష మాత్రం తన వెడ్డింగ్ కార్డు కూడా తన ప్రొఫెషన్ కు తగ్గట్టుగా ఉండాలని ప్రశ్న పేపర్( Question Paper ) రూపంలో పెళ్లి పత్రికను డిజైన్ చేయించింది.
ఆ పెళ్లి పత్రికను ఎనిమిది ప్రశ్నల రూపంలో విభజించి వాటికి సమాధానం ఇవ్వాలంటే ఆహ్వాన పత్రికలు వారి బంధుమిత్రులకు పంపింది.సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్, ట్రూఫాల్స్ ఆన్సర్ క్వశ్చన్స్‌గా వెడ్డింగ్ కార్డును సరికొత్తగా రూపొందించారు.
అలాగే ఈ పెళ్లి పత్రికలో ప్రత్యూష కు( Pratyusha ) కాబోయే వరుడు వివరాలు, వరుడి తల్లిదండ్రుల వివరాలు, తన తండ్రి వివరాలు కళ్యాణ వేదిక, సుముహూర్తం ఇలాంటివన్నీ వివరాలు తెలియచేసే లాగా ప్రశ్నాపత్ర పెళ్లి పత్రికలో ప్రింట్ చేయించారు.ఇక అమ్మాయి టాలెంట్ ను చూసి బంధువులందరూ ఆ అమ్మాయిను మెచ్చుకున్నారు.