నేడు దేశవ్యాప్తంగా రాఖీ పండుగ( Rakhi Festival ) జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.సోదరులకు వారి ప్రియమైన సోదరి లు ఎంతో ఆప్యాయత, ఇష్టపూర్వకంగా రాఖీ కట్టించుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ పండగ పూట మహబూబాబాద్ జిల్లాలో( Mahabubabad ) తీవ్ర విషాదం జరిగింది.హాస్పిటల్లో కొన ఊపిరిలో ఉన్న ఒక అమ్మాయి తన సోదరులకు హాస్పిటల్లో రాఖీ కట్టి తుది శ్వాస విడిచింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.నర్సింహులపేట మండలంలో కోదాడలో డిప్లమా చదువుతున్న ఒక అమ్మాయి ఆకతాయిల వేధిస్తుండడంతో మన స్థాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
పురుగుల మందు తగి అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించింది.ఈ క్రమంలో ఆ అమ్మాయిని చికిత్స కోసం హాస్పిటల్ లో చేర్పించారు వారి కుటుంబ సభ్యులు.కొన్న ఊపిరితో ఉన్న ఆ మహిళ రక్షాబంధన్( Rakshabandhan ) వరకు ఉంటానో లేదో అని ఆ మహిళ తన తమ్ముడు, అన్నలకు( Brothers ) రాఖీ కట్టింది.ఈ తరుణంలో గంట సమయంలోనే అమ్మాయి మృతి చెందింది.
ఇక కళ్ళముందే ఆ యువతి ప్రాణాలు కోల్పోవడం చూసి ఆ తల్లిదండ్రులు, సోదరులు తీవ్ర కన్నీరు మున్నీరు అయిపోయారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఈ నేపథ్యంలో వీడియో చూసిన నెటిజెన్స్ వారి స్పందనలను వివిధరకాలుగా తెలుపుతున్నారు.ఎవరో ఏదో అన్నారని కన్నవారికి ఇలాంటి కడుపు బాధలు మిగిలించి వెళ్తున్నావు అంటూ కామెంట్స్ చేసే వారు కూడా ఉన్నారు.ఇకపోతే ఇలాంటి ఘటనలు చూడడానికి చాలా బాధేస్తుంది అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.