నల్లగొండ జిల్లా: బెట్టింగ్ మహమ్మారికి బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి చివరికి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే… హాలియా పట్టణంలోని నల్లగొండ చౌరస్తాలో తడకమళ్ళ పేరుతో కిరాణా షాప్ నడుపుతున్న తడకమళ్ళ సోమయ్య కుమారుడు సాయికుమార్ గత కొన్ని నెలలుగా బెట్టింగ్ కు బానిసై
దాదాపు రూ.5 కోట్లు పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.అప్పుల బాధ తట్టుకోలేక హాలియా 14 మైళ్ళ కాలువలో దూకి ఆత్మహత్య పాల్పడగా సోమవారం అనుముల మండలం చెక్ పోస్ట్ దగ్గర కాలువలో మృతదేహం తేలి కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.